Breaking News

మౌలికం 6.3 శాతం అప్‌

Published on Sat, 06/29/2024 - 06:12

న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్‌ వృద్ధి మే నెలలో 6.3 శాతంగా నమోదైంది. బొగ్గు, సహజ వాయువు, విద్యుత్‌ రంగాల్లో ఉత్పత్తి మెరుగుపడటం ఇందుకు దోహదపడింది. గతేడాది ఇదే నెలలో ఇన్‌ఫ్రా రంగ వృద్ధి 5.2 శాతం. మరోవైపు, ఏప్రిల్‌లో నమోదైన 6.7 శాతంతో పోలిస్తే గత నెలలో వృద్ధి మందగించడం గమనార్హం. ఎరువులు, క్రూడాయిల్, సిమెంటు రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది.  

పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది కీలక మౌలిక రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది. శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో.. బొగ్గు ఉత్పత్తి 10.2 శాతం, సహజ వాయువు 7.5 శాతం, విద్యుదుత్పత్తి 12.8 శాతంగా నమోదైంది. 2023లో ఇదే నెలలో ఇవి వరుసగా 7.2 శాతం, (–) 0.3 శాతం, 0.8 శాతంగా ఉన్నాయి. 

రిఫైనరీ ఉత్పత్తుల తయారీ వృద్ధి రేటు 0.5 శాతానికి, ఉక్కు ఉత్పత్తి 7.6 శాతానికి మందగించింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడం, దశలవారీగా సుదీర్ఘ సమయం పాటు పార్లమెంటు ఎన్నికలు జరగడం వంటి అంశాలు కొన్ని రంగాల్లో కార్యకలాపాలపై ప్రభావం చూపి ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు. అదే సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్‌కి భారీ డిమాండ్‌ నెలకొందని, ఏప్రిల్‌తో పోలిస్తే మే లో బొగ్గు, విద్యుత్‌ రంగాల వృద్ధికి ఇది దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. మే నెలలో ఐఐపీ వృద్ధి 4–5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు నాయర్‌ చెప్పారు. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)