Breaking News

జూలైలో ఎగుమతులు 16% డౌన్‌

Published on Tue, 08/15/2023 - 04:51

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆరి్థక అనిశ్చితి పరిస్థితులు భారత్‌ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశ జూలై ఎగుమతుల్లో (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 16 శాతం క్షీణించాయి. విలువలో 32.25 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. కీలక పెట్రోలియం, రత్నాలు–ఆభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది.  

దిగుమతులూ క్షీణతే..: ఇక దిగుమతుల విలువ కూడా జూలైలో 17% పడిపోయి 52.92 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.67 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2022 జూలైలో 25.43 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు తాజాగా దాదాపు 5 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం.  

నాలుగు నెలల్లోనూ..
ఈ ఏడాది (2022–23) ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య ఎగుమతులు 14.5% పడిపోయి 136.22 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 13.79 శాతం పడిపోయి 213.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 76.98 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఈ నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు  2.7% పెరిగి 13.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతుల బిల్లు 23.4% తగ్గి 55 బిలియన్‌ డాలర్లకు దిగివచి్చంది.

ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతులపై మరిన్ని ఆంక్షలు ఉండబోవు: కేంద్రం
మరిన్ని ఎల్రక్టానిక్‌ వస్తువులపై దిగుమతి ఆంక్షలు విధించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బరత్వాల్‌  తెలిపారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించడానికి అలాగే దేశీయ తయారీని పెంచడానికి నవంబర్‌ 1 నుండి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మరికొన్ని ఎల్రక్టానిక్‌ పరికరాలపై దిగుమతి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, మొబైల్‌ తయారీకి ప్రొడక్షన్‌–లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్‌ఐ) పథకం వర్తిస్తుందని మంత్రి చెప్పారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)