Breaking News

మళ్లీ కొలువుల కళకళ!

Published on Sat, 06/14/2025 - 05:14

ముంబై: ఉద్యోగ నియామకాలు మే నెలలో సానుకూలంగా నమోదయ్యాయి. ఎనిమిది నెలల వరుస క్షీణత తర్వాత మే నెలలో 8.9 శాతం నియామకాలు పెరిగినట్టు (పోస్టింగ్‌లు) జాబ్‌సైట్‌ ఇండీడ్‌ ప్రకటించింది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లోనే అధిక నియామకాలు కొనసాగుతున్నట్టు స్పష్టం చేసింది. మరింత సంఘటిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్‌ మారుతుండడం ఇందుకు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. 

భారత్‌లో ఉద్యోగ నియామకాలు కరోనా ముందు సంవత్సరం (2019) కంటే 80 శాతం అధికంగా ఉన్నట్టు, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎంతో మెరుగని వెల్లడించింది. ముఖ్యంగా యూకే, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్‌లో ఉద్యోగ నియామకాలు ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువగా ఉండడాన్ని తన నివేదికలో ఇండీడ్‌ ప్రస్తావించింది. వీటితో పోల్చి చూసినప్పుడు భారత్‌లో నియామకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. భారత్‌ మార్పు దిశగా ప్రయాణిస్తుండడంతో ఇటీవలి సంవత్సరాల్లో సంఘటిత రంగంలో మరిన్ని ఉద్యోగ కల్పనలకు దారితీస్తున్నట్టు విశ్లేíÙంచింది. ఇతర ఆర్థిక వ్యవస్థలు ఈ స్థాయిలో సంఘటితం వైపు అడుగులు వేయడం లేదని తెలిపింది.  

ఈ విభాగాల్లో అధిక నియామకాలు.. 
చిన్నారుల సంరక్షణ విభాగంలో 27 శాతం, వ్యక్తిగత సంరక్షణ, గృహ ఆరోగ్యంలో 25 శాతం, విద్యా రంగంలో 24 శాతం, తయారీలో 22 శాతం చొప్పున మే నెలలో నియామకాలు పెరిగాయి. అదే సమయంలో డెంటల్‌ రంగలో 10.2 శాతం, వ్యవసాయం, ఫారెస్ట్రీలో 8.6 శాతం, కమ్యూనిటీ, సామాజిక సేవల్లో 6.8 శాతం, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో 4.2 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. మే నెలలో 1.5 శాతం ఉద్యోగ ప్రకటనల్లో కంపెనీలు జెనరేటివ్‌ ఏఐ అవసరాన్ని ప్రస్తావించాయి. ముఖ్యంగా డేటా అనలైటిక్స్‌ ఉద్యోగాల్లో 12.5 శాతం వాటికిర, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో 3.6 శాతం, సైంటిఫిక్‌ రీసెర్చ్‌లో 3.1 శాతం మేర జెనరేటివ్‌ ఏఐ పరిజ్ఞానాన్ని అవసరాన్ని పేర్కొన్నాయి.     

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)