Breaking News

జపాన్‌ ఎగుమతులకు బూస్ట్‌ 

Published on Sun, 02/23/2025 - 04:58

న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకోవడం ద్వారా ఇండియా జపాన్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతూకాన్ని తీసుకురానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఇందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్‌–జనవరిలో జపాన్‌కు దేశీ ఎగుమతులు 21 శాతంపైగా ఎగసి 5.1 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతుల విలువ 9.1 శాతం పెరిగి 15.92 బిలియన్‌ డాలర్లను తాకింది. వెరసి 10.82 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది. 

గతేడాది(2023–24)లో జపాన్‌కు భారత్‌ ఎగుమతులు 5.15 బిలియన్‌ డాలర్లుకాగా.. దిగుమతులు 17.7 బిలియన్‌ డాలర్లు. వాణిజ్య లోటు 12.55 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సమతూకానికి చర్యలు చేపట్టినట్లు గోయల్‌ తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. తద్వారా పరస్పర లబ్దికి వీలుంటుందని ఇండియా–జపాన్‌ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల(ఎకానమీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) సదస్సులో గోయల్‌ తెలియజేశారు.

 ఈ సందర్భంగా గ్రీన్‌ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, హైటెక్‌ సెమీకండక్టర్ల తయారీ, ఎల్రక్టానిక్స్‌ గూడ్స్, ఏఐ తదితర విభాగాలలో మరింత సహకారానికి జపనీస్‌ సంస్థలను ఆహ్వానించారు. సమీకృత స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(సీఈపీఏ)పై రెండు దేశాలు 2011లో సంతకాలు చేశాయి. 1,400కుపైగా జపనీస్‌ కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పలు జపనీస్‌ కంపెనీలతో 8 రాష్ట్రాలలో 11 పారిశ్రామిక టౌన్‌షిప్‌లు విస్తరించాయి. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ముంబై, అహ్మదాబాద్‌ హైస్పీ డ్‌ రైల్‌ సహా ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రో వ్యవస్థలు దేశీ అభివృద్ధిలో జపనీస్‌ కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తున్నట్లు గోయల్‌ ప్రస్తావించారు. సమీప భవిష్యత్‌లో ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్‌ ట్రయిన్‌ సరీ్వసులు ప్రారంభంకాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)