Breaking News

స్పీడ్‌ తగ్గిన పారిశ్రామికోత్పత్తి 

Published on Tue, 07/29/2025 - 05:40

న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగం వృద్ధి జూన్‌లోనూ నిదానించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.9 శాతంగా నమోదైంది. వృద్ధి 1.5 శాతానికి పరిమితమైంది. ఇది పది నెలల (2024 ఆగస్ట్‌ తర్వాత) కనిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్‌ రంగాల్లో పనితీరు ఢీలాపడింది. జూన్‌ చివర్లో వర్షాలు ఈ రంగాల పనితీరును ప్రభావితం చేశాయి. ఈ మేరకు జూన్‌ నెలకు సంబంధించి ఐఐపీ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసింది. మే నెలకు సంబంధించిన ఐఐపీ రేటును 1.2 శాతం నుంచి 1.9 శాతానికి సవరించినట్టు ఎన్‌ఎస్‌వో ప్రకటించింది.  

→ తయారీ రంగంలో ఉత్పత్తి జూన్‌లో 3.9 శాతం పెరిగింది. 2024 జూన్‌లో ఈ రంగంలో ఉత్పత్తి 3.5 శాతం వృద్ధి చెందడం గమనార్హం.  
→ మైనింగ్‌లో ఉత్పత్తి మైనస్‌ 8.7 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే నెలలో 10.3 శాతం వృద్ధి నమోదైంది.  
→ విద్యుదుత్పత్తి సైతం మైనస్‌ 2.6 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో 8.6 శాతం వృద్ధి నమోదైంది.  
→ క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలోనూ వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది.  
→ కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌లో వృద్ధి 2.9 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 8.8 శాతంగా ఉంది.  
→ కన్జ్యూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తి మైనస్‌ 0.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది జూన్‌లోనూ మైనస్‌ ఒక శాతంగా ఉండడం గమనార్హం.  
→ ఇన్‌ఫ్రా/నిర్మాణ రంగంలో 7.2 శాతం వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇది 8.2 శాతం వృద్ధిని చూసింది.   
→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌)నూ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4 శాతంగా ఉంది.

వర్షాల ప్రభావం.. 
జూన్‌ రెండో భాగంలో అధిక వర్షాలు మైనింగ్‌ ఉత్పత్తి, విద్యుత్‌ రంగాలపై ప్రభావం చూపించినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ తెలిపారు. త్రైమాసికం వారీగా చూస్తే వృద్ధి 11 నెలల కనిష్ట స్థాయికి చేరినట్టు పేర్కొన్నారు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)