Breaking News

చౌక దిగుమతులపై యాంటీ డంపింగ్‌ సుంకం

Published on Mon, 03/24/2025 - 05:55

న్యూఢిల్లీ: చైనా సహా పలు ఆసియా దేశాల నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమలను కాపాడేందుకు కేంద్రం కఠిన చర్య తీసుకుంది. వ్యాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ ఫ్లాస్క్ లు, అల్యూమినియం ఫాయిల్‌ సహా ఐదు ఉత్పత్తులపై యాంటీ డంపింగ్‌ సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. సాఫ్ట్‌ ఫెరైట్‌ కోర్స్, ట్రైక్లోరో ఇసోసైనారిక్‌ యాసిడ్, పాలీ వినిల్‌ క్లోరైడ్‌ పేస్ట్‌ రెజిన్‌పై యాంటీ డంపింగ్‌ సుంకాలు మోపింది. 

చైనా సహా పలు దేశాలు సాధారణ ధరలకంటే చౌకగా ఈ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి కుమ్మరిస్తున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక నోటఫికేషన్లను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీఐటీ) అండ్‌ కస్టమ్స్‌ (రెవెన్యూ విభాగం) జారీ చేసింది. సాఫ్ట్‌ ఫెరైట్‌ కోర్స్, వ్యాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ ఫ్లాస్క్  , ట్రిక్లోరో ఇసోసైనారిక్‌ యాసిడ్‌పై ఐదేళ్లపాటు యాంటీ డంపింగ్‌ సుంకాలు అమలవుతాయని పేర్కొంది.  

ఐదేళ్ల పాటు అమల్లో..: ఎలక్ట్రిక్‌ వాహనాలు, చార్జర్లు, టెలికం పరికరాల్లో సాఫ్ట్‌ ఫెరైట్‌ కోర్స్‌ను వినియోగిస్తుంటారు. వీటిపై 35 శాతం అదనపు సుంకాన్ని సీబీఐటీ కస్టమ్స్‌ విధించింది. వ్యాక్యూమ్‌ ఇన్సులేటెడ్‌ ఫ్లాస్క్ లపై టన్నుకు 1,732 డాలర్ల యాంటీ డంపింగ్‌ సుంకం అమలు కానుంది.  పాలీ వినిల్‌ క్లోరైడ్‌ పేస్ట్‌ రెజిన్‌పై టన్నుకు 89 డాలర్ల నుంచి 707 డాలర్ల మధ్య చైనా, దక్షిణ కొరియా, మలేషియా, నార్వే, తైవాన్, థాయిలాండ్‌ నుంచి వచ్చే దిగుమతులకు ఐదేళ్లపాటు వర్తిస్తుంది. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)