ఎన్ని అవమానాలు వచ్చినా.. రజిని.. కమల్ కానిది విజయ్ సాధించాడు
Breaking News
ఏప్రిల్‌లో కోలుకున్న తయారీ
Published on Tue, 05/05/2026 - 04:22
న్యూఢిల్లీ: తయారీ రంగం ఏప్రిల్ నెలలో కాస్తంత మెరుగుపడింది. తయారీ రంగంలో పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ సర్వే) 54.7 పాయింట్లుగా నమోదైంది. మార్చిలో ఇది 53.9గా ఉంది. కొత్త ఆర్డర్లు రావడం ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగేందుకు దారితీసింది. కానీ, గత నాలుగేళ్లలో ఇది రెండో బలహీన వృద్ధి కావడం గమనార్హం.
కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి, ఉపాధి కల్పన తదితర అంశాల ఆధారంగా పనితీరును హెచ్‌ఎస్‌బీసీ ప్రతి నెలా అంచనా వేస్తుంటుంది. సాధారణంగా 50 పాయింట్లకు పైన విస్తరణగా, అంతకు దిగువన తగ్గుదల చూస్తారు. విక్రయాలు, ఉత్పత్తికి బలమైన డిమాండ్ అనుకూలించినట్టు పీఎంఐ సర్వే తెలిపింది. ‘‘పశి్చమాసియా ఘర్షణల ప్రభావం తయారీపై స్పష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా 2022 ఆగస్ట్ తర్వాత తయారీ వ్యయాలు వేగంగా పెరిగాయి. దీంతో తుది ధరలు సైతం ఆరు నెలల్లోనే అధికంగా పెరిగాయి’’అని హెచ్‌ఎస్‌బీసీ ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. కొత్త ఎగుమతుల ఆర్డర్లు, ఉపాధి కల్పన మోస్తరుగా పెరిగినట్టు చెప్పారు. ఎగుమతి ఆర్డర్లు ఏడు నెలల్లోనే వేగవంతంగా పెరిగినట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెన్యా, చైనా, సౌదీ అరేబియా, యూఏఈ, యూకే నుంచి ఆర్డర్లు పెరిగాయి. మరోవైపు తయారీలో ఉపాధి కల్పన మోస్తరుగా పెరిగింది. 400 తయారీ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించి హెచ్‌ఎస్‌బీసీ ప్రతి నెలా ఈ వివరాలు విడుదల చేస్తుంటుంది.
Tags : 1