Breaking News

నీటిపై తేలాడే సోలార్‌ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..

Published on Thu, 10/31/2024 - 10:32

పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి దేశంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రధాన నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో 56 మెగావాట్లు ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా, మరో 120 మెగావాట్ల పవర్‌ను గ్రౌండ్‌‌మౌంట్‌ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి ఎల్‌ అండ్‌ టీ సంస్థ కాంట్రాక్ట్‌ పొందింది.

ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’

గ్రౌండ్‌మౌంట్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సాధారణంగా అధిక విస్తీర్ణంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అదే నీటిపై తేలాడే ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ల ఏ‍ర్పాటుకు ఈ ఇబ్బంది ఉండదు. రెండింటిలో ఏ ప్లాంటైనా మౌలిక సదుపాయాల ఖర్చు ఎలాగూ ఉంటుంది. దాంతో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌లకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు.

  • ఎన్‌టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ రామగుండం: స్థాపిత సామర్థ్యం-100 మెగావాట్లు, ఇది 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.

  • ఎన్‌టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కాయంకులం: స్థాపిత సామర్థ్యం-92 మెగావాట్లు. కేరళలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 450 ఎకరాల సరస్సుపై ఏర్పాటు చేశారు.

  • రిహాండ్ డ్యామ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్: స్థాపిత సామర్థ్యం-50 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.

  • సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్: దీని స్థాపిత సామర్థ్యం-25 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 75 ఏకరాల్లో ఇది విస్తరించి ఉంది.

  • ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్: దీని అంచనా సామర్థ్యం-600 మెగావాట్లు. మధ్యప్రదేశ్‌లో దీని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)