Breaking News

ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!

Published on Thu, 06/27/2024 - 11:16

భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ  ల్యాబ్ తాజా నివేదికలో పేర్కొంది. దేశంలోని బిలియనీర్ సంపదలో దాదాపు 90 శాతం అగ్రకులాల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు తేలింది.

'ట్యాక్స్ జస్టిస్ అండ్ వెల్త్ రీ డిస్ట్రిబ్యూషన్‌ ఇన్ ఇండియా' పేరుతో రూపొందించిన ఈ నివేదికలో సంపద పంపిణీకి సంబంధించిన అంశాలను వివరించారు. దేశంలోని బిలియనీర్ల సంపదలో 88.4 శాతం అగ్రకులాల మధ్య కేంద్రీకృతమై ఉందని నివేదిక డేటా వివరణాత్మక విశ్లేషణను అందిస్తోంది. అత్యంత అణగారిన వర్గాలలో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీలు) సంపన్న భారతీయులలో ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం.

ఈ అసమానత బిలియనీర్ సంపదను మించి విస్తరించింది. 2018-19 ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే (ఏఐడీఐఎస్) ప్రకారం జాతీయ సంపదలో అగ్రవర్ణాల వాటా దాదాపు 55 శాతం. సంపద యాజమాన్యంలోని ఈ స్పష్టమైన వ్యత్యాసం భారతదేశ కుల వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఆర్థిక అసమానతలను నొక్కిచెబుతోంది.

స్వాతంత్య్రానంతరం క్షీణించిన దేశ ఆదాయం, సంపద అసమానతలు 1980వ దశకంలో పెరగడం ప్రారంభమయ్యాయి. 2000వ దశకం నుంచి మరింత ఉచ్ఛ స్థాయికి పెరిగాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సంపద కేంద్రీకరణ పరంగా అసమానతలు శిఖరాగ్రానికి పెరగడం గమనార్హం. ముఖ్యంగా టాప్ 1 శాతం జనాభా దేశంలోని మొత్తం సంపదలో 40 శాతానికి పైగా నియంత్రిస్తున్నారు. ఇది 1980లో ఉన్న 12.5 శాతం కంటే పెరిగింది. మొత్తం ప్రీట్యాక్స్‌ ఆదాయంలో 22.6 శాతం వీరు సంపాదిస్తున్నారు. ఇది 1980లో ఇది 7.3 శాతంగా ఉండేది.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు