Breaking News

జోరుగా జీఎస్‌టీ వసూళ్లు 

Published on Fri, 01/02/2026 - 01:21

న్యూఢిల్లీ: నిత్యావసరాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) 2025 డిసెంబర్‌ నెలకు రూ.1.74 లక్షల కోట్లు వసూలైంది. 2024 డిసెంబర్‌లో ఆదాయం రూ.1.64 లక్షల కోట్లు కంటే 6 శాతం పెరిగింది. గత ఏడాది సెపె్టంబర్‌ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్‌టీ రేటు తగ్గించడం తెలిసిందే. 12, 28 శాతం శ్లాబులు ఎత్తివేయడం ఫలితంగా వాటి రేట్లు దిగొచ్చాయి. అయినప్పటికీ జీఎస్‌టీ ఆదాయం మెరుగ్గా నమోదవుతుండడం గమనార్హం. 

దేశీ ఉత్పత్తులపై ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.1.22 లక్షల కోట్లుగా ఉంటే, దిగుమతి అయిన వస్తువులపై జీఎస్‌టీ రూపంలో ఆదాయం 19.7 శాతం పెరిగి రూ.51,977 కోట్లకు చేరింది. రిఫండ్‌లు సైతం 31 శాతం పెరిగి రూ.28,890 కోట్లుగా ఉన్నాయి. 

డిసెంబర్‌ నెలకు నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1.45 లక్షల కోట్లుగా నమోదైంది. 2024 డిసెంబర్‌ నెలకంటే 2.2 శాతం పెరిగింది. సెస్సు రూపంలో ఆదాయం రూ.4,238 కోట్లకు పరిమితమైంది. 2024 డిసెంబర్‌లో రూ.12,003 కోట్ల సెస్సు వసూలు కావడం గమనించొచ్చు. సెపె్టంబర్‌ 22 నుంచి సెస్సు అన్నది కేవలం పొగాకు, వాటి ఉత్పత్తులకే పరిమితం చేయగా, లగ్జరీ వస్తువులపై తొలగించడం తెలిసిందే.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)