ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
జీఎస్టీ వసూళ్ల జోష్!
Published on Fri, 10/02/2026 - 05:12
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు దుమ్మురేపాయి. పటిష్టమైన దేశీ వినియోగంతో పాటు దిగుమతుల ఆదాయం దన్నుతో సెపె్టంబర్లో రూ.2.03 లక్షల కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 14.7 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) లో జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది మూడోసారి. ఏప్రిల్లో రికార్డు స్థాయిలో రూ.2.43 లక్షల కోట్లు, జూలైలో రూ. 2.11 లక్షల కోట్ల చొప్పున లభించింది. కాగా, 2026–27 తొలి ఆరు నెలల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం వృద్ధితో రూ. 12.46 లక్షల కోట్లు నమోదుకాగా, నికర జీఎస్టీ ఆదాయం 10.6 శాతం పెరిగి రూ. 10.66 లక్షల కోట్లకు చేరింది. ఇతర ముఖ్యాంశాలివీ...
→ సెపె్టంబర్లో దేశీ ఆర్థిక కార్యకలాపాల నుంచి స్థూల జీఎస్టీ వసూళ్లు 10.1 శాతం వృద్ధి చెంది రూ. 1.38 లక్షల కోట్లను తాకాయి. దిగుమతుల నుంచి ఆదాయాలు 26 శాతం ఎగిసి రూ.65,525 కోట్లకు చేరాయి.
→ ఇక జీఎస్టీ రిఫండ్లు 3 శాతం తగ్గుదలతో రూ.27,001 కోట్లుగా నమోదయ్యాయి.
→ రిఫండ్లను సర్దుబాటు చేస్తే, నికర జీఎస్టీ ఆదాయం రూ.1.76 లక్షల కోట్లుగా నమోదైంది. 18.1 శాతం వృద్ధి చెందింది.
Tags : 1