Breaking News

5 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లు

Published on Thu, 09/18/2025 - 08:20

మధ్య, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సాధించేందుకు అత్యుత్తమ అవకాశాలున్నట్లు గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ తాజాగా అభిప్రాయపడింది. దీంతో రానున్న ఐదేళ్లలో ప్రయివేట్‌ రంగం నుంచి 800 బిలియన్‌ డాలర్ల(రూ. 70 లక్షల కోట్లు) పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రయివేట్‌ పెట్టుబడులు ఊపందుకునే చాన్స్‌ లేనట్లు పేర్కొంది.

ప్రయివేట్‌ రంగంలో భారీస్థాయి సామర్థ్య విస్తరణలో అప్రమత్తత కనిపిస్తున్నట్లు సంస్థ అధికారి గీతా చుగ్‌ తెలియజేశారు. కాగా.. ప్రయివేట్‌ రంగంలో పెట్టుబడులు కనిపిస్తున్నప్పటికీ నామినల్‌ జీడీపీ వృద్ధి రేటుకంటే తక్కువ స్థాయిలో నమోదవుతున్నట్లు ఎస్‌అండ్‌పీ దేశీ రేటింగ్స్‌ యూనిట్‌ క్రిసిల్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ డీకే జోషీ పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాలు, టారిఫ్‌లలో మార్పులు, తదితర తీవ్ర అనిశ్చితులు కార్పొరేట్‌ సంస్థల పెట్టుబడి నిర్ణయాలలో ఆలస్యానికి కారణమవుతున్నట్లు వివరించారు.

పలు కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకోవడంలో బ్యాంకులకు బదులుగా సొంత అంతర్గత వనరులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. బ్యాంక్‌ రుణాలు లేదా క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి రుణ సమీకరణ ద్వారా కనీసస్థాయిలోనే నిధులను సమీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి పరిస్థితులు మెరుగుపడనుండటంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలో 12–13 శాతం రుణ వృద్ధికి వీలున్నట్లు అంచనా వేశారు.

ఇదీ చదవండి: దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్‌ ఆఫర్‌?

#

Tags : 1

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)