Breaking News

జీడీపీ వృద్ధి 7.4%

Published on Sat, 05/31/2025 - 05:39

న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో (2024–25 ఆర్థిక సంవత్సరం క్యూ4) 7.4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది తొలి మూడు నెలల్లో నమోదైన వృద్ధి రేటు 8.4 శాతంతో పోల్చితే ఒక శాతం క్షీణించింది. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గింది. ఇది నాలుగేళ్ల కనిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) 9.2 శాతంగా ఉంది. 

క్యూ4తోపాటు గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తయారీ రంగం డీలా పడడం వృద్ధి రేటును ప్రభావితం చేసింది. అదే సమయంలో వ్యవసాయ రంగం బలమైన పనితీరు నమోదు చేయడం ఊరటనిచ్చే అంశం. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 330.68 లక్షల కోట్లు (3.9 ట్రిలియన్‌ డాలర్లు)గా నమోదైంది. వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమమైంది. 

‘‘రియల్‌ జీడీపీ (ప్రామాణిక) లేదా స్థిరమైన ధరల ఆధారిత జీడీపీ 2024–25లో 187.97 లక్షల కోట్లుగా ఉంది. 2023–24 సంవత్సరానికి జీడీపీ సవరించిన అంచనాల ప్రకారం 176.51 లక్షల కోట్లుగా ఉంది. అంటే 6.5 శాతం వృద్ధి రేటు నమోదైంది. నామినల్‌ జీడీపీ (వస్తు సేవల తుది ధరల ఆధారంగా) 2024–25లో రూ.330.68 లక్షల కోట్లుగా వచ్చింది. 2023–24 సంవత్సరానికి రూ.301.23 లక్షల కోట్లుగా ఉంది. అంటే 9.8 శాతం వృద్ధి రేటు నమోదైంది’’ అని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ప్రకటించింది. 
  
2024 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటే, 2024 జూలై–సెపె్టంబర్‌ క్వార్టర్‌కు 5.6 శాతం, 2024 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికానికి 6.5 శాతం చొప్పున ఉండడం గమనార్హం. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో చైనా జీడీపీ 5.4 శాతం వృద్ధిని సాధించింది.  

డీలా పడిన తయారీ రంగం 
→ ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం ఎక్కువ క్షీణతను చవిచూసింది. ఈ రంగం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12.3 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతానికి పరిమితమైంది.  
→ ఇదే కాలంలో వ్యవసాయ రంగం మెరుగైన వృద్ధితో ఆదుకుంది. 2023–24 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 2.7 శాతమే కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతానికి పుంజుకున్నది.  
→ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో తయారీ రంగం వృద్ధి రేటు 4.8 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన 11.3 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గింది. ఈ గణాంకాల ఆధారంగా తయారీ రంగం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది.  
→ ఇక వ్యవసాయ రంగం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లోనూ మెరుగైన పనితీరు చూపించింది. వృద్ధి రేటు 5.4 శాతానికి చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌కు ఇది 0.9 శాతంగా ఉంది.  
→ నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 10.8 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 8.7 శాతంగా ఉంది.  
→ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల్లో వృద్ధి రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 5.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 8.8 శాతంగా ఉంది.  
→ క్యూ4లో సేవల రంగంలో (ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలు) జీవీ ఏ వృద్ధి (స్థూల విలువ జోడింపు) రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఉన్న 8.8 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది.  
→ ఫైనాన్షియల్, రియల్‌ ఎస్టేట్, వృత్తి సేవల పరంగా వృద్ధి క్యూ4లో 7.8 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 9 శాతంగా ఉంది.  

అంచనాల మేరకే ద్రవ్యలోటు
2024–25లో 4.8 శాతం 
గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) జీడీపీలో ద్రవ్యలోటును 4.8 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సాధించింది. రూ.15,77,270 కోట్లుగా నమోదైనట్టు కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్‌కు ప్రభుత్వం సమరి్పంచిన సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు రూ.15,69,527 కోట్ల కంటే కేవలం రూ.7వేల కోట్ల మేర (లక్ష్యంలో 105 శాతం) అదనంగా నమోదైంది.

 ఇక గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం రూ.30.36 లక్షల కోట్లుగా ఉంది. సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో ఇది 98.3 శాతానికి సమానం. 2024–25లో ప్రభుత్వ వ్యయం రూ.46.55 లక్షల కోట్లుగా ఉందని, సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో ఇది 98.7 శాతానికి సమానమని సీజీఏ తెలిపింది. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 5.63 శాతంగా ఉండడం గమనార్హం.  

నాలుగో ఏడాది వేగవంతమైన వృద్ధి
భారత్‌ వరుసగా నాలుగో ఏడాదీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన వృద్ధి క్రమాన్ని కొనసాగించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ గణాంకాలు వెలువడడంతో ఆమె స్పందించారు. క్యూ4లో తయారీ రంగం చక్కని పనితీరు చూపించడం జీడీపీ వృద్ధి రేటు పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.5% చేరడానికి దారితీసినట్టు  చెప్పారు. ‘‘భారత్‌ నాలుగో ఏడాది వేగవంతమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. చిన్న, మధ్య, భారీ పరిశ్రమల కృషి వల్లే ఇది సాధ్యమైంది. మన తయారీ, సేవల సామర్థ్యాలు చురుగ్గానే ఉన్నాయి. వ్యవసాయం సైతం స్థిరమైన వృద్ధిని చూపిస్తోంది’’అని మంత్రి చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)