Breaking News

వాణిజ్య అవరోధాలపై ప్రధాన దృష్టి: సునీల్‌ బరత్‌వాల్‌

Published on Fri, 03/21/2025 - 13:48

న్యూఢిల్లీ: ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్‌టీఏ) దిగుమతి సుంకాలు, టారిఫ్‌యేతర అంశాల్లాంటి ప్రధాన వాణిజ్య అవరోధాలపై ముందుగా దృష్టి పెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బరత్‌వాల్‌ తెలిపారు.

సాధారణంగా ఇవి ఓ కొలిక్కి వచ్చేసరికే ఎక్కువ సమయం పట్టేస్తుందని, అప్పటికల్లా అందరికీ ఎఫ్‌టీఏలపై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే టారిఫ్‌లు, టారిఫ్‌యేతర అడ్డంకులు, నియంత్రణ సంస్థలపరమైన సమస్యలు మొదలైన వాటిని ముందుగా పరిష్కరించుకునే విధానం పాటించడం శ్రేయస్కరమని చెప్పారు.

సీఐఐ నిర్వహించిన ఇండియా–ఎల్‌ఏసీ (లాటిన్‌ అమెరికా–కరీబియన్‌) బిజినెస్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా సునీల్‌ ఈ విషయాలు వివరించారు. భారత్‌ ఇప్పటికే బ్రెజిల్, పరాగ్వే తదితర దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని, ఎల్‌ఏసీ ప్రాంత దేశాలతో కూడా అవరోధాలను అధిగమించే అవకాశాలను పరిశీలిస్తోందని చెప్పారు.

ప్రపంచ దేశాలు రక్షణాత్మక ధోరణులను తగ్గించుకుని వాణిజ్య వృద్ధికి ఊతమివ్వాలని సూచించారు. ఆటోమొబైల్, మెడికల్‌ డివైజ్‌లు, ఫార్మా తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని సునీల్‌ చెప్పారు.

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)