Breaking News

క్రిప్టో విధానాలపై త్వరలో చర్చా పత్రం

Published on Fri, 05/30/2025 - 12:49

క్రిప్టో ఆస్తులపై భవిష్యత్ విధాన నిర్ణయాలకు పునాది వేసే వివరణాత్మక చర్చా పత్రాన్ని రూపొందించే చివరి దశలో భారత్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే ప్రజలు, ఆర్థిక నిపుణుల ఫీడ్ బ్యాక్ కోసం ఈ చర్చా పత్రాన్ని విడుదల చేస్తామని విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ పత్రం రూపొందించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు (ఎఫ్ఎస్‌బీ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంశ్లేషణ పత్రం నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిసింది.

వర్చువల్ డిజిటల్ ఆస్తులపై చర్చాపత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది పబ్లిక్‌ డొమైన్‌లోకి వచ్చిన తర్వాత క్రిప్టోపై భారతదేశం విస్తృత నియంత్రణ విధానాన్ని రూపొందించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కొందరు నిపుణులు క్రిప్టో విషయంలో భారత్ వైఖరిని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం 2022లో వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుంచి వచ్చే లాభాలపై 30% పన్నును ప్రవేశపెట్టినప్పటికీ చట్టపరమైన గుర్తింపులో తేడాలున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చర్చాపత్రంలోని అంశాలు అమల్లోకి వస్తే దేశంలో పనిచేస్తున్న అన్ని క్రిప్టో ఎక్స్ఛేంజీలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: మొబైల్‌లో త్వరగా ఛార్జింగ్‌ అయిపోతుందా?

గ్లోబల్ క్రిప్టో చర్చల్లో భారత్ ఇప్పటికే ప్రముఖ పాత్ర పోషించింది. జీ20 సదస్సులో గ్లోబల్ రెగ్యులేటరీ రోడ్ మ్యాప్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించింది. ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మద్దతుతో ఆ రోడ్ మ్యాప్ పర్యవేక్షణకు పిలుపునిచ్చింది. క్రిప్టో అసెట్ మార్కెట్లు రిస్క్‌తో కూడుకున్న నేపథ్యంలో ఎఫ్ఎస్‌బీ సిఫార్సులను న్యూఢిల్లీ జీ20 లీడర్స్ డిక్లరేషన్ కూడా ఆమోదించింది. గ్లోబల్ డిజిటల్ ఫైనాన్స్ గవర్నెన్స్‌లో భారత్‌ పాత్రను ఇది బలోపేతం చేసింది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)