Breaking News

ప్రపంచం చూపు.. భారత్‌ వైపు..!

Published on Tue, 04/09/2024 - 08:44

ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్తులో ఇతర దేశాలు శ్రామికశక్తికోసం యువకులు ఎక్కువగా ఉండే భారత్‌ వంటి దేశాలవైపు చూసే పరిస్థితులు ఏర్పడవచ్చని టీమ్‌లీజ్‌ డిగ్రీ అప్రెంటిస్‌షిప్‌ ఉపాధ్యక్షుడు, బిజినెస్‌ హెడ్‌ ధృతి ప్రసన్న మహంత ఇటీవల తెలిపారు. ప్రపంచానికి నిపుణులైన కార్మికులను అందించే సత్తా భారత్‌కు ఉందని చెప్పారు. 

దశాబ్దం క్రితం భారత్‌ నుంచి ఉపాధి కోసం, ఇతర కారణాల వల్ల కార్మికులు పలు దేశాలకు వలస వెళ్లేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ప్రపంచ దేశాలకు నిపుణుల కొరత తీర్చేలా భారత్‌ సన్నద్ధం అవుతోందని మహంత చెప్పారు. అందులో భాగంగానే ప్రపంచంలోని నిపుణుల కొరత తీర్చడానికి ప్రస్తుతం ఇతర దేశాలకు పయనం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి శ్రామికశక్తిలో భారత కార్మికులు దాదాపు 15 శాతం ఉండడం గమనార్హం. రానున్న ఐదేళ్లలో భారత కార్మికులు ఇతర దేశాలకు వెళ్లడం 28-30శాతం పెరుగుతుందన్నారు. అంతర్జాతీయంగా ఎక్కువగా ఐటీ, నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, డేటా అనలిటిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ప్లబింగ్‌, మెకానిక్‌, ఆతిథ్యం, సేల్స్‌ రంగాల్లో నిపుణులకు, కార్మికులకు గిరాకీ ఏర్పడుతుందని అంచనా వేశారు.

ఇదీ చదవండి: భారత్‌లో ‘యాపిల్‌’ ఇళ్ల నిర్మాణం..?

భారత్‌లో 15-65 ఏళ్ల వయసు వారు సుమారు 55.4 కోట్ల మంది ఉన్నారని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, యూకే, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా, యూఎస్‌ఏ, జపాన్‌, మలేషియా తదితర దేశాల్లో భారతీయ కార్మికులకు గిరాకీ పెరుగుతోందని మహంత చెప్పారు. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా దాదాపు లక్ష మందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా 13,944 మందిని, ఖతార్‌ 3,646 మంది, యూఏఈ 2,941 మంది భారత నిపుణులను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. 

#

Tags : 1

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు