5 బిలియన్‌ డాలర్లకు క్లినికల్‌ ట్రయల్స్‌ పరిశ్రమ

Published on Sat, 10/14/2023 - 04:23

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా క్లినికల్‌ ట్రయల్స్‌ పరిశ్రమ ఏటా 7–8 శాతం మేర వృద్ధి చెందనుంది. 2.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో దాదాపు 5 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుంది. అంతర్జాతీయంగా క్లినికల్‌ రీసెర్చ్‌ దిగ్గజాల్లో ఒకటైన పారెక్సెల్‌ భారత విభాగం ఎండీ సంజయ్‌ వ్యాస్‌ శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాలు తెలిపారు.

దేశీయంగా దాదాపు 40 పైగా అధ్యయనాలు జరుగుతుండగా.. వాటిలో తమ సంస్థ సుమారు 12–15 స్టడీస్‌ నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. భారత్‌లో తమకు మొత్తం 5 కేంద్రాల్లో 6,000 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా.. హైదరాబాద్, చండీగఢ్‌ సెంటర్లు అతి పెద్దవని వ్యాస్‌ వివరించారు. వచ్చే అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 8,000కు పెంచుకోనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో తమకు 2,500 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు వివరించారు.

తెలంగాణ సహా దేశీయంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు పరిస్థితులు, నిపుణుల లభ్యత బాగుంటున్నాయని ఆయన చెప్పారు. అయితే, పేషెంట్లలో అవగాహన, తృతీయ శ్రేణి పట్టణాలు మొదలైన చోట్ల మౌలిక సదుపాయాలు, అధ్యయనాల మధ్యలోనే పేషెంట్లు తప్పుకోవడం తదితర అంశాలపరంగా కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందని వ్యాస్‌ పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశ్రమకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించేందుకు విద్యాసంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వంతోనూ ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)