Breaking News

మనోళ్లు ‘మ్యాగీ’ లాగించేస్తున్నారు!

Published on Wed, 06/19/2024 - 01:22

న్యూఢిల్లీ: మ్యాగీ.. బహుశా భారత్‌లో ఈ పేరు తెలియనివారు ఉండరేమో. నూడుల్స్‌కు మారుపేరుగా స్థానం సంపాదించిందంటే ఎంతలా మార్కెట్లోకి చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. నూడుల్స్, సూప్స్‌ ఉత్పత్తులను ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే మ్యాగీ బ్రాండ్‌ కింద విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా మ్యాగీ ఉత్పత్తుల అమ్మకాల్లో భారత్‌ తొలి స్థానంలో నిలవడం విశేషం. 2023–24లో ఏకంగా 600 కోట్లకుపైగా సర్వింగ్స్‌ (ఒకరు తినగలిగే పరిమాణాన్ని ఒక సర్వింగ్‌గా పరిగణిస్తారు) స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని కంపెనీ వెల్లడించింది.

అంతేకాదు నెస్లే కిట్‌క్యాట్‌ బ్రాండ్‌కు టాప్‌–2 మార్కెట్‌గా భారత్‌ స్థానం సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరంలో 420 కోట్ల కిట్‌క్యాట్‌ ఫింగర్స్‌ అమ్ముడయ్యాయి. ఈ విషయాలను నెస్లే ఇండియా తన 2023–24 వార్షిక నివేదికలో వెల్లడించింది. రెండంకెల వృద్ధితో నెస్లే ఇండియా వేగంగా దూసుకెళ్తున్న మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని సంస్థ తెలిపింది. భారత్‌లో 10వ ప్లాంటును నెస్లే ఒడిశాలో ఏర్పాటు చేస్తోంది. ప్లాంట్ల విస్తరణ, సామర్థ్యం పెంపునకు 2020–25 మధ్య రూ.7,500 కోట్లు వెచి్చస్తున్నట్టు నెస్లే ఇండియా సీఎండీ సురేశ్‌ నారాయణన్‌ వెల్లడించారు. గడిచిన ఎనిమిదేళ్లలో కంపెనీ భారత్‌లో 140కిపైగా ఉత్పత్తులను పరిచయం చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)