Breaking News

విద్యుత్‌కు డిమాండ్‌ అంతంతే..!

Published on Thu, 07/31/2025 - 01:14

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో వేసవి ఉష్ణోగ్రతలు మరీ తీవ్రంగా లేకపోవడంతో విద్యుత్‌కి డిమాండ్‌ అంతగా ఉండకపోవచ్చని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేస్తోంది. 2025లో విద్యుత్‌ వినియోగం 4 శాతం స్థాయిలో పెరగవచ్చని ఒక నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే 2025–26 వ్యవధిలో, దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌కి డిమాండ్‌ పెరగనున్నప్పటికీ భారత్, చైనాలో మాత్రం ఇది ఓ మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని వివరించింది. 

ఐఈఏ ప్రకారం భారత్‌లో గతేడాది విద్యుత్‌ వినియోగం 6 శాతం పెరగ్గా ఈసారి 4 శాతం స్థాయిలో ఉండనుంది. అలాగే చైనాలో 2024లో వినియోగం 7 శాతం పెరగ్గా ఈ ఏడాది 5 శాతానికి పరిమితం కానుంది. డిమాండ్‌ నెమ్మదించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎలక్ట్రిసిటీ వినియోగ వృద్ధిలో ఈ రెండు దేశాల వాటా, గతేడాది తరహాలోనే, 50 శాతానికి పైగా ఉంటుందని ఐఈఏ తెలిపింది. ‘అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల వల్ల భారత్‌లో పారిశ్రామిక కార్యకలాపాలపై ప్రభావం పడింది. 

అలాగే వేసవి తీవ్రత కూడా పెద్దగా లేకపోవడం వల్ల 2024తో పోలిస్తే 2025 ప్రథమార్ధంలో విద్యుత్‌ వినియోగం 1.4 శాతమే పెరిగింది. వేసవి ముగిసిపోయినందున, ఇక సెప్టెంబర్‌లో డిమాండ్‌ మెరుగుపడితే, వార్షికంగా సుమారు 4 శాతం మేర వృద్ధి నమోదు కావచ్చు‘ అని ఐఈఏ తెలిపింది. పరిశ్రమలు, సేవల కార్యకలాపాలు పుంజుకుని, ఏసీల అమ్మకాలు కూడా పెరగడం వల్ల 2026లో ఎలక్ట్రిసిటీ డిమాండ్‌ 6.6 శాతం పెరగవచ్చని పేర్కొంది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)