Breaking News

భారత్‌ ఎకానమీ వృద్ధి 6.8 శాతం

Published on Thu, 12/07/2023 - 04:58

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023 ఏప్రిల్‌–2024 మార్చి) 6.8 శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల చాంబర్‌– సీఐఐ అంచనావేసింది. ఇంతక్రితం వేసిన 6.5–6.7 శాతం వృద్ధి శ్రేణికన్నా తాజా అంచనాలు అధికం కావడం గమనార్హం. ఇక 2024–25లో వృద్ధి రేటు 7 శాతానికి చేరుతుందని విశ్లేíÙంచింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపార వాతావరణం సులభతరం చేయడంపై  ప్రభుత్వం నిరంతర దృష్టి సారించడం వంటి అంశాలు ఎకానమీ పురోగతికి కారణంగా పేర్కొంది. 2022–23లో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 

2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది.  క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది.  క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా 7.6 శాతం వృద్ధి ఫలితం వెలువడింది.  క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది.  ఆర్‌బీఐ అంచనాలను మించి తాజాగా సీఐఐ అంచనాలు వెలువడ్డం గమనార్హం. టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌కు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ కూడా అయిన సీఐఐ ప్రెసిడెంట్‌ ఆర్‌ దినేష్‌ తాజాగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాలు ఇవీ..

► తాజా పాలసీ కొనసాగింపునకు... ఇటీవలి రాష్ట్ర ఎన్నికల ఫలితాలు (మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు), స్టాక్‌ మార్కెట్, పరిశ్రమ సానుకూలంగా ఉన్నాయి.   
►విధానపరమైన నిర్ణయాల కొనసాగింపును మేము స్వాగతిస్తాము. ఆయా అంశాలు దేశ పురోగతికి దోహదపడతాయన్న విషయంలో  ఏకాభిప్రాయం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విధానపరమైన అంశాల్లో మార్పు ఉండకూడదని మేము వివరించి చెప్పడానికి ప్రయతి్నస్తాము. స్టాక్‌ మార్కెట్‌ కూడా ఇదే విధమైన చర్యల పట్ల సానుకూలంగా ఉంటుంది.  
►పెట్టుబడులకు భారత్‌ తగిన ఆకర్షణీయ ప్రాంతమని మేము విశ్వసిస్తున్నాము. మౌలిక వనరుల అభివృద్ధి, తగిన వాతావరణ సానుకూల పరిస్థితుల ఏర్పాటుపై కేంద్రం తగిన విధంగా దృష్టి సారించడం  దీనికి కారణం.  
►రాబోయే ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షల్లో రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఈ రేటును ఆర్‌బీఐ 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. గడచిన నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో రేటు పెంపు నిర్ణయం తీసుకోలేదు) తగ్గించాలని మేము కోరడం లేదు. రేటు తగ్గించాలని కోరడానికి ఇది తగిన సమయం అని మేము భావించడం లేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం బెంచ్‌మార్క్‌ (4 శాతం) కంటే ఎక్కువగా ఉంది.  
►ఇప్పుడు పలు రంగాలు తమ మొత్తం సామర్థ్యంలో 75 నుంచి 95 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాయి. గత 3 త్రైమాసికాల నుంచీ ఇదే పరిస్థితి. అయితే త్వరలో పరిస్థితి మారుతుందని విశ్వసిస్తున్నాం. పలు కంపెనీలు తమ మూలధన పెట్టుబడులను పెంచుతున్నాయి.  
►మేము మా సభ్యత్వ సంస్థల ప్రతినిధులతో సర్వే చేశాము. మెజారిటీ సభ్యులు వాస్తవానికి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలి్చతే (2023 ఏప్రిల్‌–సెప్టెంబర్‌) రెండవ అర్థ భాగంలో (2023 అక్టోబర్‌–మార్చి 2024) అధిక పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని సర్వేలో వెల్లడైంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)