Breaking News

భారత్ జీడీపీ వృద్ధి: మూడీస్‌ అంచనా ఇదే..

Published on Thu, 03/13/2025 - 09:52

న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి 2025–26 సంవత్సరంలో 6.5 శాతాన్ని మించుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం మూడీస్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది 6.3%గా ఉంటుందన్నది మూడిస్‌ రేటింగ్స్‌ గత అంచనా. ప్రభుత్వం నుంచి అధిక మూలధన వ్యయాలు, పన్నుల తగ్గింపుతో పెరిగే వినియోగం, వడ్డీ రేట్ల తగ్గింపు ఇవన్నీ వృద్ధికి అనుకూలిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత బ్యాంకింగ్‌ రంగం పట్ల స్థిరమైన దృక్పథాన్ని (స్టెబుల్‌ అవుట్‌లుక్‌) ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నిర్వహణ వాతావరణం మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.

ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకుల రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడగా, మోస్తరుగా క్షీణించొచ్చని తెలిపింది. అన్‌ సెక్యూర్డ్, సూక్ష్మ రుణాల్లో (మైక్రోఫైనాన్స్‌) ఒత్తిళ్లను ప్రస్తావించింది. రేట్ల త గ్గింపు నేపథ్యంలో నికర వడ్డీ మార్జిన్లపై ప్రభావం పెద్దగా ఉండదని, బ్యాంకుల లాభదాయకత పటిష్టంగా ఉంటుందని అంచనా వేసింది.

2024 మధ్య నుంచి భారత వృద్ధి నిదానించగా, తిరిగి వేగాన్ని అందుకుంటుందని.. ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది. ప్ర స్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌ త్రైమాసికంలో జీడీపీ 5.6%కి పడిపోగా, డిసెంబర్‌ క్వార్టర్‌లో తిరిగి 6.2%కి పుంజుకోవడం గమనార్హం.

2025–26లో సగటు ద్రవ్యోల్బణం 4.5%కి దిగొస్తుందని మూడీస్‌ పేర్కొంది. ఫిబ్రవరి సమీక్షలో ఆర్‌బీఐ ఎంపీసీ రెపో రేటును తగ్గించడం తెలిసిందే. ‘‘అమెరికా వాణిజ్య విధానాలతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో.. ఆర్‌బీఐ కాస్త అప్రమత్త ధోరణిని అనుసిరించొచ్చు. దీంతో తదుపరి రేట్ల కోత మోస్తరుగా ఉండొచ్చు’’అని మూడీస్‌ పేర్కొంది. 2025–26లో రుణాల వృద్ధి 11–13 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.   

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు