Breaking News

రెండేళ్లపాటు 6.4 శాతం వృద్ధి 

Published on Thu, 07/31/2025 - 01:23

న్యూయార్క్‌: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశావహ అంచనాలను ప్రకటించింది. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించిన అంచనాలను ఐఎంఎఫ్‌ స్వల్పంగా పెంచడం గమనార్హం. ఈ ఏడాదికి సంబంధించి 0.2 శాతం, వచ్చే ఏడాదికి 0.1 శాతం మేర తాజా అంచనాల్లో ఎగువకు సవరించింది. ఈ మేరకు తన తాజా నివేదికను విడుదల చేసింది. బలమైన వినియోగానికి.. ప్రభుత్వ పెట్టుబడులకు చురుకైన సంస్కరణలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది.

 రానున్న కాలంలో ఈ సానుకూల వృద్ధిని కొనసాగించడం భారత్‌కు ఎంతో కీలకమని ఐఎంఎఫ్‌ పరిశోధన విభాగం చీఫ్‌ డెనిజ్‌ ఇగాన్‌ పేర్కొన్నారు. వేగంగా ఉపాధి సృష్టి, నైపుణ్యాల కల్పన ద్వారా వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్న కారి్మకులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడంతోపాటు.. మౌలిక వసతులు, వాణిజ్య అడ్డంకులను తొలగించడం భారత్‌ ముందున్న ప్రాధాన్యతలుగా తెలిపారు. మధ్య కాలానికి భారత్‌ విద్యపై పెట్టుబడులు పెంచడం, భూ సంస్కరణలు చేపట్టడం, సామాజిక భద్రత కల్పించడం, నిబంధనలు, పాలనా యంత్రాంగం నుంచి అవరోధాలను తొలగించడం కూడా కీలకమేనని పేర్కొన్నారు.  

అంతర్జాతీయ వృద్ధి అంచనాలూ పెంపు 
వర్ధమాన దేశాల్లో ఆర్థిక వృద్ధి 2025లో 4.1 శాతం, 2026లో 4 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఇక చైనా ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను సైతం 2025 సంవత్సరానికి 0.8 శాతం పెంచి 4.8 శాతంగా ఐఎంఎఫ్‌ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బలమైన పనితీరుకు తోడు, అమెరికాతో టారిఫ్‌లు గణనీయ స్థాయి నుంచి తగ్గడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. 2026లో 4.2 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం స్వల్పంగా పెంచి 2025లో 3 శాతంగా, 2026లో 3.1 శాతంగా ఉంటుందని పేర్కొంది.   
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)