Breaking News

190 బిలియన్‌ డాలర్లకు  ఈ–రిటైల్‌ మార్కెట్‌

Published on Sun, 03/30/2025 - 02:19

న్యూఢిల్లీ: దేశీ ఈ–రిటైల్‌ మార్కెట్‌ ఏటా 18 శాతం వృద్ధి చెందనుంది. 2030 నాటికి 170–190 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. ఓ నివేదిక ప్రకారం స్థూల ఆర్థికాంశాలు, వినియోగంపరమైన సవాళ్ల కారణంగా 2024లో ఈ–రిటైల్‌ రంగ వృద్ధి చారిత్రక గరిష్టమైన 20 శాతం నుంచి నెమ్మదించి సుమారు 10–12 శాతానికి మందగించింది. అయితే, ఇటీవల ద్రవ్య పరపతి విధానాన్ని సరళతరం చేయడంతో వృద్ధి క్రమంగా పుంజుకోనుంది.

 ముఖ్యంగా 2025 పండుగ సీజన్‌ నుంచి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ‘దీర్ఘకాలికంగా మార్కెట్‌ ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్నాయి. ఈ–రిటైల్‌ రంగం వచ్చే ఆరేళ్లు 18 శాతం వృద్ధి చెంది 170–190 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు‘ అని నివేదిక పేర్కొంది. ముఖ్యావసరయేతర ఉత్పత్తులు, సేవలపై ప్రజలు మరింతగా ఖర్చు చేయనుండటం ఇందుకు దోహదపడనుంది.  

రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు.. 
→ గత దశాబ్దకాలంలో రిటైల్‌కి సంబంధించి భారత్‌ శక్తివంతమైన కేంద్రంగా మారింది. 2024లో అంతర్జాతీయంగా మూడో అతి పెద్ద రిటైల్‌ మార్కెట్‌గా ఎదిగింది. 

→ ఇటీవలి కాలంలో వినియోగం, ముఖ్యావసరాలు కాకుండా ఇతరత్రాల ఉత్పత్తులు, సేవలపై ఖర్చు చేయడం కాస్త నెమ్మదించింది. ప్రైవేట్‌ వినియోగం కోవిడ్‌ పూర్వం (2017–19లో) 11 శాతంగా ఉండగా దానితో పోలిస్తే కోవిడ్‌ తర్వాత (2022–24) 8 శాతానికి తగ్గింది. వేతనాలు పెద్దగా పెరగకపోవడం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటం మొదలైన అంశాలు ఇందుకు కారణం. 

→ ఇటీవల ద్రవ్యపరపతి విధానాన్ని సరళతరం చేయడంతో ఈ–రిటైల్‌ వృద్ధి మళ్లీ పుంజుకోనుంది. నిత్యావసరాలు, దుస్తులు.. ఎల్రక్టానిక్స్‌ వంటి ఉత్పత్తుల అమ్మకాలు ఇందుకు దోహదపడనున్నాయి. 2030 నాటికి ప్రతి మూడు డాల ర్లలో వీటి వాటా రెండు డాలర్లుగా ఉంటుంది.  

→ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఈ–రిటైల్‌ వినియోగం పెరుగుతోంది. 2020 నుంచి చూస్తే కొత్తగా షాపింగ్‌ చేస్తున్న ప్రతి అయిదుగురిలో ముగ్గురు ఈ ప్రాంతాల నుంచే ఉంటున్నారు. అలాగే, 2021 నుంచి చూస్తే కొత్త విక్రేతల్లో 60 శాతం మంది ద్వితీయ శ్రేణి లేదా అంతకన్నా చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు. 

→ క్విక్‌ కామర్స్, హైపర్‌ వేల్యూ కామర్స్‌ మొదలైన విభాగాలు తదుపరి ఈ–రిటైల్‌ వృద్ధికి దోహదపడనున్నాయి.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)