Breaking News

ఆకాశవీధిలో పెరిగిన ప్రయాణికులు

Published on Sat, 03/01/2025 - 11:17

దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 జనవరిలో దేశీయ విమానయాన సంస్థలు 1.46 కోట్ల ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేశాయి. ఇది 2024 జనవరిలో 1.31 కోట్లుగా ఉంది. దాంతో 11.28 శాతం పెరుగుదల నమోదు చేసినట్లయింది. ఈ పెరుగుదల దేశంలో విమాన ప్రయాణానికి అధికమవుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది.

విమాన ప్రయాణికులకు సంబంధించి ఇండిగో వాటా 65.2 శాతంగా ఉంటే ఎయిరిండియా గ్రూప్ వాటా 25.7 శాతం, ఆకాసా ఎయిర్, స్పైస్‌జెట్‌ వాటాలు వరుసగా 4.7, 3.2 శాతంగా నమోదయ్యాయి. ఆన్ టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ-సమయానికి రాకపోకలు నిర్వహించడం)లో ఇండిగో 75.5 శాతంతో మొదటిస్థానంలో నిలువగా, ఆకాసా ఎయిర్ 71.5 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఎయిరిండియా గ్రూప్ ఓటీపీ 69.8 శాతం, అలయన్స్ ఎయిర్ ఓటీపీ 57.6 శాతం, స్పైస్ జెట్ 54.8 శాతంగా ఉన్నాయి.

షెడ్యూల్‌ చేసిన దేశీయ విమానయాన సంస్థల మొత్తం రద్దు రేటు జనవరి 2025లో 1.62 శాతంగా ఉంది. ఫ్లై బిగ్ అత్యధికంగా 17.74 శాతం, ఫ్లై91 5.09 శాతం, అలయన్స్ ఎయిర్ 4.35 శాతం రద్దు రేటును నమోదు చేశాయి. విమానాల ఆలస్యం వల్ల 1,78,934 మంది ప్రయాణీకులు ప్రభావితం అయ్యారు. వీరికి సౌకర్యాలు అందించేందుకు విమానయాన సంస్థలు రూ.2.38 కోట్లు ఖర్చు చేశాయి. 2024 జనవరితో పోలిస్తే 2025లో విమానయాన సంస్థలు సామర్థ్య విస్తరణను 10.8 శాతం పెంచాయి. దేశీయ విమానయాన రంగం 2024 జనవరిలో 89.2 శాతం ఉన్న ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్-మొత్తం సీట్లకు తగిన ప్యాసింజర్లు) 2025లో 92.1 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి: వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాల ప్రభావం

ప్రయాణికుల పెరుగుదలకు కారణాలు..

కొవిడ్‌ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడంతో విమాన ప్రయాణికుల్లో విశ్వాసం నెలకొంది. ఎయిర్ లైన్ నెట్‌వర్క్‌ల విస్తరణ, కొత్త మార్గాలను ఆవిష్కరించిడంతో అధిక జనాభా విమాన ప్రయాణం చేసేందుకు వీలువుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విమానయాన సంస్థలు ప్రయాణికులను ఆకర్షించడానికి పోటీ ఛార్జీలు, ప్రమోషనల్ డీల్స్‌ను అందిస్తున్నాయి. ఇది విమాన ట్రాఫిక్ పెరుగుదలను మరింత పెంచింది. విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, ఆధునీకరణలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇది కూడా ప్రయాణ సంఖ్య పెరిగేందుకు దోహదం చేస్తోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)