Breaking News

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో జోరు

Published on Tue, 03/18/2025 - 08:49

ప్రత్యక్ష పన్నుల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జోరు కనబరుస్తోంది. మార్చి 16 వరకు రూ.21.26 లక్షల కోట్లు నికరంగా వసూలైనట్టు ప్రభుత్వ డేటా వెల్లడిస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 13 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులకు చివరి తేదీ మార్చి 15తో ముగిసింది. కార్పొరేట్‌ పన్ను విభాగంలో అడ్వాన్స్‌ ట్యాక్స్‌ 12 శాతానికి పైగా పెరిగి రూ.7.57 లక్షల కోట్లుగా ఉంది. 

నికర నాన్‌ కార్పొరేట్‌ ట్యాక్స్‌ (ఇందులో వ్యక్తిగత ఆదాయపన్ను ప్రధానమైనది) క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 17 శాతం ఎగిసి రూ.11.01 లక్షల కోట్లుగా ఉంది. నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన పన్ను రూ.10,000 మించితే వారు ముందస్తు పన్నును ఆర్థిక సంవత్సరం ముగింపులోపే చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు వాయిదాల్లో (జూన్‌ 15, సెప్టెంబర్‌ 15, డిసెంబర్‌ 15, మార్చి15) దీన్ని చెల్లించొచ్చు. 

ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..

భారీగా పెరిగిన ఎస్‌టీటీ ఆదాయం సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) 56 శాతం వృద్ధితో రూ.53,095 కోట్లుగా నమోదైంది. రిఫండ్‌లు సైతం రూ.3.60 లక్షల కోట్లకు పెరిగాయి. మార్చి 16 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (రిఫండ్‌లు సహా) 16 శాతం పెరిగి రూ.25.86 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.22.07 లక్షల కోట్ల ఆదాయపన్ను వసూళ్లను ప్రభుత్వం తొలుత అంచనా వేయగా, తర్వాత రూ.22.37 లక్షల కోట్లకు సవరించడం గమనార్హం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)