Breaking News

ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

Published on Fri, 06/19/2026 - 10:23

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ 17 నాటికి నికర ఆదాయపన్ను (ప్రత్యక్షపన్ను) వసూళ్లు 15 శాతం వరకు పెరిగి రూ.5.21 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా స్పష్టం చేసింది. నికర కార్పొరేట్‌ పన్నుల వసూళ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 22 శాతం వృద్ధితో రూ.2.08 లక్షల కోట్లకు చేరాయి.

నికర నాన్‌ కార్పొరేట్‌ పన్నుల ఆదాయం 8 శాతం పెరిగి రూ.2.94 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, వాణిజ్య సంస్థల పన్నులు నాన్‌ కార్పొరేట్‌ కిందకు వస్తాయి. రిఫండ్‌లు మే 17 నాటికి రూ.89,026 కోట్లుగా ఉన్నాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) రూపంలో ఆదాయం 45 శాతం పెరిగి రూ.18,856 కోట్లకు చేరింది. ముందస్తు పన్ను చెల్లింపులు 15.30 శాతం  అధికమై రూ.1.78 లక్షల కోట్లు వసూలయ్యాయి.

స్థూల పన్ను వసూళ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు జూన్‌ 17 నాటికి 12.46 శాతం పెరిగి రూ.6.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.26.97 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ లక్ష్యంగా ఉంది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)