Breaking News

పెరిగిన డాలర్ విలువ: ఆసియా దేశాలపై ఎఫెక్ట్!

Published on Thu, 11/07/2024 - 16:07

యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తరువాత అమెరికా డాలర్‌ విలువ పెరుగుదల దిశగా పయనిస్తోంది.. గ్లోబల్ కరెన్సీలు పతనమవుతున్నాయి. ఈ ప్రభావం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల మీద ప్రభావం చూపుతోంది. అనేక ఆసియా దేశాలు ఈ ప్రభావానికి తీవ్రంగా లోనైనప్పటికీ.. భారతదేశం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని తెలుస్తోంది.

గత దశాబ్ద కాలంలో.. భారత్ వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. ఇతర ఆసియా దేశాలతో పాటు చైనా ఆర్ధిక వ్యవస్థ మందగిస్తే.. ఆ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్ మీద కూడా పడుతుంది. రూపాయి విలువ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది. దీనిని నిపుణులు 'ఎఫ్ఎక్స్ యుద్ధం' అని సంబోధించారు.

గ్లోబల్ కరెన్సీ విలువల తగ్గుదల అనేది.. రాబోయే సంవత్సరాల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ (FX) మార్కెట్లలో ప్రపంచ అస్థిరతను రేకెత్తించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ డాలర్ బలపడటం అనేది ప్రపంచ కరెన్సీ మార్కెట్‌లో సవాళ్లను పెంచుతుందని చెబుతున్నారు.

డాలర్ పెరుగుదలకు కారణం కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. సెప్టెంబరులో బేసిస్ పాయింట్ రేటు తగ్గింపుకు సంబంధించిన ఫెడ్ వ్యూహాత్మక పునరాలోచన అని కూడా తెలుస్తోంది. డాలర్ విలువ పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు కూడా దీనివైపు ఆకర్షితులవుతున్నారు.

ట్రంప్ విజయం డాలర్‌కు అందించిన స్వల్పకాలిక మద్దతు మాత్రమే. కానీ ప్రపంచ కరెన్సీ మార్కెట్ సంక్లిష్టమైన స్థితిలో ఉంది. ముఖ్యంగా ఆసియా అంతటా.. చైనాతో సహా ఆర్థిక ఒత్తిళ్లకు గురవుతున్నాయి. ఎఫ్‌ఎక్స్ యుద్ధం తీవ్రతరం కావడం వల్ల వచ్చే నష్టాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రవిభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)