Breaking News

సౌర ఇంధనంలో మూడో స్థానానికి భారత్‌

Published on Thu, 10/09/2025 - 08:30

సోలార్‌ విద్యుదుత్పత్తి పరంగా భారత్‌ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది. ఉత్పాదక సామర్థ్యం 125 గిగావాట్ల సామర్థ్యాన్ని అధిగమించినట్టు కేంద్ర పనరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. అంతర్జాతీయ సోలార్‌ కూటమి (ఐఎస్‌ఏ) కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.

‘కాప్‌28 అంగీకారం మేరకు ప్రపంచ పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 11,000 గిగావాట్లకు చేరుకోవాలి. ఈ లక్ష్య సాధనలో సోలార్‌ విద్యుత్‌ అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. నేడు 125 గిగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలో భారత్‌ మూడో అతిపెద్ద సోలార్‌ విద్యుదుత్పత్తిదారుగా ఉంది’ అని మంత్రి తెలిపారు.

దేశ ఆకాంక్ష క్షేత్రస్థాయిలో ఎంత ప్రభావం చూపించగలదన్నది దానికి ఈ పురోగతి నిదర్శనమని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్‌ ముఫ్తి బిజ్లీ యోజన పథకం కింద ఇప్పటికే 20 లక్షలకు పైగా గృహాలకు రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుత్‌ వసతులు సమకూర్చినట్టు చెప్పారు. ఈ నెల 27 నుంచి 30 వరకు అంతర్జాతీయ సోలార్‌ కూటమి సదస్సు ఢిల్లీలో జరగనుంది. సోలార్‌ ఇంధన పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్, ఫ్రాన్స్‌ సంయుక్తంగా ఐఎస్‌ఏని ఏర్పాటు చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు