భారత్.. భూటాన్ మధ్య ఒప్పందం: ఎందుకంటే?

Published on Sun, 09/22/2024 - 16:15

దేశ రాజధానిలో జరిగిన గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ సందర్భంగా.. భూటాన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (BFDA)తో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో భారత్, భూటాన్ మధ్య ఆహార భద్రత అమలుకు సంబంధించిన ఒప్పందం జరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం.. ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ, బీఎఫ్డీఏ మధ్య సాంకేతిక సహకారం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఆహార భద్రత, వాణిజ్య సౌలభ్యం విషయంలో భూటాన్‌తో మా భాగస్వామ్యంలో కీలకమైన అభివృద్ధిని సూచిస్తుందని.. ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ జీ కమల వర్ధనరావు పేర్కొన్నారు. బీఎఫ్డీఏతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా రెండు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే బలమైన, సమర్థవంతమైన ఆహార భద్రత ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.

ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాలను నెలకొల్పడంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నాయకత్వాన్ని అంగీకరించామని బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా (Gyem Bidha) పేర్కొన్నారు. భారత్, భూటాన్ మధ్య సురక్షితమైన ఆహార వాణిజ్యాన్ని సులభతరం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని అన్నారు.

ఇదీ చదవండి: ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!

ఈ సమావేశానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో భూటాన్ దేశానికీ చెందిన బీఎఫ్డీఏ డైరెక్టర్ జియెమ్ బిధా, బీఎఫ్డీఏ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ విభాగానికి చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు. భారత్ నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఎఫ్ఎస్ఎస్ఏఐ సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)