వచ్చే ఐదేళ్లలో 50 ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు

Published on Tue, 06/03/2025 - 14:05

దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసి మొత్తం ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను 212కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) వార్షిక సమావేశంలో ఈమేరకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఈ విస్తరణలో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

దేశం అంతటా ప్రజలకు మరింత చౌకగా, అందుబాటు ప్రాంతాల్లో విమానప్రయాణం చేసేలా ఉడాన్‌ పథకం సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 619 కొత్త మార్గాలను నెట్‌వర్క్‌లో జోడించింది. ఇది చిన్న పట్టణాలు, నగరాలకు ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పొందేందుకు దోహదపడుతుంది. విమానాశ్రయాల సంఖ్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు.

ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపు

ప్యాసింజర్ కనెక్టివిటీకి మించి భారత్‌ గ్లోబల్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ (ఎంఆర్ఓ) హబ్‌గా కూడా నిలదొక్కుకుంటోంది. 2031 నాటికి ఎంఆర్‌ఓ విభాగం 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాల నిర్వహణ అవసరాలను తీర్చే ప్రపంచ స్థాయి సౌకర్యాలను సృష్టించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మార్పు విదేశీ మరమ్మతు సేవలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశ విమానయాన ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది.

#

Tags : 1

Videos

అద్దంకిలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు

బాబూ కళ్లు పెద్దవి చేసి చూడు.. దటీజ్ YS జగన్

వైఎస్ జగన్ పుట్టిన రోజు.. రోజా ప్రత్యేక పూజలు

పక్కా ప్లాన్ తోనే బాబుపై కేసులు క్లోజ్..

విజయవాడకు డ్రగ్స్ కల్చర్..!

ఫాన్స్ అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డ సామ్

దుఃఖాన్ని దిగమింగుకొని స్మృతి మంధాన విశ్వరూపం

వంట మనుషులతో MOUలు.. ఇదేం పాడుపని బాబు

అప్పులపాలై.. బెట్టింగ్ యాప్స్ కు బలైన హైడ్రా కమిషనర్ గన్ మెన్..

కోడలితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే..

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)

+5

జగన్‌ మావయ్యతో క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)

+5

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌.. అరుదైన (రేర్‌) ఫొటోలు