Breaking News

Vice President Jagdeep Dhankhar: పరస్పర సహకారం మరింతగా పెరగాలి

Published on Sat, 08/24/2024 - 05:42

న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా మధ్య మౌలిక సదుపాయాలు, స్పేస్, వ్యవసాయం, మైనింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాల్లో పరస్పర సహకారం మరింతగా పెరగాలని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ఆకాంక్షించారు. ఇండియా–ఆఫ్రికా సదస్సులో మాట్లాడుతూ డ్యూటీ–ఫ్రీ టారిఫ్‌ ప్రిఫరెన్స్‌ (డీఎఫ్‌టీపీ) స్కీముతో ఇరు దేశాలు అభివృద్ధి చెందడానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

 పుష్కలంగా సహజ వనరులు, ఆఫ్రికన్‌ కాంటినెంటల్‌ ఫ్రీ ట్రేడ్‌ ఏరియా ద్వారా పెరుగుతున్న ఆర్థిక సమగ్రత తదితర అంశాల కారణంగా పెట్టుబడులకు ఆఫ్రికా ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంటోందని ధన్‌కడ్‌ చెప్పారు. అలాగే, కొత్త తరం డిజిటల్‌ టెక్నాలజీలు, అంతరిక్ష రంగంలాంటి విషయాల్లో భారత్‌తో ఆఫ్రికా సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవచ్చన్నారు. 

సీఐఐ ఇండియా–ఆఫ్రికా బిజినెస్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ధన్‌కడ్‌ ఈ విషయాలు వివరించారు. 43 ఆఫ్రికా దేశాల్లో 203 ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై భారత్‌ 12.37 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు చెప్పారు. 85 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఆఫ్రికాకు భారత్‌ నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటోందని వివరించారు. స్వచ్ఛ సాంకేతికత, వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలవగలిగే సాగు విధానాలు, తీర ప్రాంత గస్తీ, కనెక్టివిటీ వంటి విభాగాల్లో భారత్, ఆఫ్రికా కలిసి పని చేయొచ్చని ధన్‌కడ్‌ చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)