Breaking News

పెరుగుతున్న సౌర విద్యుత్‌ సామర్థ్యం

Published on Wed, 08/14/2024 - 14:21

పునరుత్పాదక ఇందన వనరులను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సోలార్‌ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగంలో తయారీ ప్లాంట్లు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా సమగ్ర ఎనర్జీ సామర్థ్యం పెరుగుతోంది. 2024 జులై నెలలో 1,733.7 మెగావాట్ల కెపాసిటీ కలిగిన సోలార్‌ ఎనర్జీను ఉత్పత్తి చేశారు. దాంతో మొత్తం దేశీయంగా తయారయ్యే స్థాపిత సౌర విద్యుత్‌ సామర్థ్యం 87.2 గిగావాట్లకు చేరింది.

2025 ఆర్థిక సంవత్సరం జులైలో 5,394 మెగావాట్ల సోలార్‌ ఎనర్జీ తయారవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అనుకున్న విధంగానే జరిగితే రానున్న ఏడాది మొత్తంగా రికార్డుస్థాయిలో 30-35 గిగావాట్ల సౌర విద్యుత్‌ తోడవుతుందని చెబుతున్నారు. 2030 వరకు ఇండియాలో 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం ఏటా సుమారు 44 గిగావాట్లు సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. అందుకోసం 2030 వరకు దాదాపు రూ.16 లక్షల కోట్ల(200 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు అవసరం అవుతాయని అంచనా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్‌లో ‘సూర్య ఘర్‌’ పథకంలో భాగంగా కోటి ఇళ్లలో సోలార్‌ ఎనర్జీ వాడేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. దానికోసం ప్రభుత్వం 40 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందని ప్రకటించారు.

ఇదీ చదవండి: ‘ప్రైమ్‌ కేటగిరీ’లో రూ.11 లక్షల వరకు జీతం

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)