నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!
Breaking News
ఐఐపీకి తయారీ బూస్ట్
Published on Tue, 06/30/2026 - 05:56
న్యూఢిల్లీ: తయారీ రంగం పనితీరు మెరుగ్గా ఉండటంతో మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం నెల ఇది 4.9 శాతంగా ఉంది. 2022–23ని బేస్ ఇయర్‌గా మార్చాకా, కొత్త సిరీస్ ప్రాతిపదికన ఐఐపీ గణాంకాలను ప్రకటించడం ఇది వరుసగా రెండో నెల. ఐఐపీ సూచీలో 463 ఐటమ్ గ్రూప్‌లు ఉంటాయి. 234 గ్రూప్‌లకు మొత్తం సూచీ వెయిటేజీలో 36.02 శాతం వాటా ఉంది.
తాజాగా మైనింగ్, క్వారీయింగ్ రంగం వృద్ధి మైనస్ 1.6 శాతంగా ఉండగా, తయారీ రంగం 5.5 శాతం, విద్యుత్–గ్యాస్ సరఫరా విభాగం 9.9 శాతం వృద్ధి చెందినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తయారీ రంగంలో అంతర్గతంగా 23 గ్రూప్‌లలో 16 గ్రూప్‌లు సానుకూల పనితీరు కనపర్చాయి. మోటర్ వాహనాలు (14.5%), ఎలక్ట్రికల్ పరికరాలు (20.8 %), బేసిక్ మెటల్స్ (4.6%) టాప్ 3 విభాగాలుగా నిల్చాయి. బేస్ ఎఫెక్ట్ కారణంగా జూన్‌లో ఐఐపీ వృద్ధి 5.7%కి మెరుగుపడొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ మేఘా ఆరోరా తెలిపారు.
Tags : 1