Breaking News

ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..

Published on Mon, 06/23/2025 - 13:40

ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేందుకు సిద్ధం కావాలి. చాలా మంది ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఐటీఆర్‌ ఫైల్‌ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కింద తెలుసుకుందాం. సరైన ధ్రువపత్రాలు, తగినంత శ్రద్ధ పెడితే ఎలాంటి అవకతవకలు లేకుండా ఐటీఆర్‌ ఫైల్‌ చేయవచ్చు.

  • ముందుగా కొత్త విధానమా, పాత విధానమా ఎంచుకోవాలి. మీరు చేయాల్సినది ఏమిటంటే రెండు విధానాల్లోనూ ఆదాయాన్ని లెక్కించండి. ఆదాయపు పన్ను భారాన్ని లెక్కించండి. ఎందులో తక్కువగా భారం ఉంటుందో దాన్ని ఎంచుకోవడం ఒక పద్ధతి. సెక్షన్‌ 80సీ మొదలైన వాటి కింద సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్, ఖర్చులు కంపల్సరీగా ఉన్నా ఈ విధంగా చేయొచ్చు. ముందుగా మీకు క్లారిటీ ఉంటే వేరే చెప్పనవసరం లేదు.

  • ఏఐఎస్, ఫారం 26 ఏఎస్‌.. ఈ రెండింటినీ డౌన్‌లోడ్‌ చేసుకోండి. వీటి ద్వారా టీడీఎస్, టీసీఎస్, మీరు చెల్లించిన ట్యాక్సులు అంటే అడ్వాన్స్‌ ట్యాక్స్, ఇవన్నీ కచి్చతంగా తెలుస్తాయి. ఏవైనా తేడాలు, హెచ్చుతగ్గులుంటే, మీ యజమానిని/ డిడక్టర్లను/ బ్యాంకులను వెంటనే సంప్రదించండి.

  • అన్ని కాగితాలను సమకూర్చుకుని వాటిని పరిశీలించండి. ఫారం 16, ఫారం 16ఏ, బ్యాంకు స్టేట్‌మెంట్, పాస్‌బుక్‌లు, వడ్డీకి సంబంధించిన సర్టిఫికెట్లు, రసీదులు, గత వారం చెప్పిన విధంగా ప్రతి డిడక్షన్‌కి సంబంధిత కాగితాలు పూర్తి వివరాలతో ఉండాలి. వాటిని చదవండి. అర్థం చేసుకోండి. ఇది బ్రహ్మవిద్యేమీ కాదు.

  • ప్రీ–ఫిల్డ్‌ ఫారంలలో సాధారణంగా తప్పులు ఉండవు. అయినా ఏదైనా అప్‌డేట్‌ చేయకపోయినా, చేర్చకపోయినా అవి అప్‌డేట్‌ కావు. ఉదాహరణకు ఇంటి అడ్రెస్‌లాంటివి. మీరు ఇల్లు మారొచ్చు. మీ బ్యాంకు ఖాతాలు మారి ఉండొచ్చు. అలాగే మీ సెల్‌ నంబర్లు. ఇలా ప్రతి అంశం కరెక్టేనా కాదా అనేది ఒకసారి చెక్‌ చేసుకోండి.

  • ఇక ఏయే ఫారం వాడాలో తెలుసుకోండి. ఎంచుకోవడమనేది మీ ఇష్టం కాదు. 1,2,3,4,5,6,7.. ఇలా మొత్తం ఏడు ఫారంలు ఉన్నాయి. మీకు నచ్చినది.. మీకు ఇష్టమైనది ఎంచుకోవడానికి వీల్లేదు. మీ ఆదాయాన్ని బట్టి ఫారంలు వర్తిస్తాయి. గతంలో ఎన్నో సార్లు తెలియజేశాం. కావాలంటే వెబ్‌సైట్‌లో వివరాలు ఉంటాయి.  

  • సాధారణంగా ఏ ఫారానికీ ఎటువంటి కాగితమూ జతపర్చనక్కర్లేదు. డాక్యుమెంట్లలోని అంకెలను చెక్‌ చేసుకుని, వాటిని కరెక్టుగా ఎటువంటి తేడాలు రాకుండా/లేకుండా నింపాలి.  

  • గడువు తేదీ లోపల ఈ ఫైల్‌ చేయండి. 2025 జులై 31 నుంచి 2025 సెప్టెంబర్‌ 15 వరకు గడువు తేదీని పొడిగించారు. తేదీ దాటితే లేటు ఫీజు పడుతుంది. నష్టాన్ని సర్దుబాటు చేయరు. ఇది చాలా పెద్ద నష్టం. అంతే కాకుండా డిడక్షన్లు, మినహాయింపులు ఇవ్వరు. గతంలో లేటుగా చేస్తే ఇన్ని నష్టాలు ఉండేవి కావు. అందుకని ఎలాంటి ఆలస్యం చేయొద్దు.

ఇదీ చదవండి: నన్ను తొలగిస్తే నీ భాగోతం బయటపెడుతా!

  • ఈ–ఫైలింగ్‌ తర్వాత వెరిఫై చేయాలి. పాన్‌తో ఆధార్‌ అనుసంధానం చేసిన వారికి సులువుగా ఈ–వెరిఫై అయిపోతుంది. మాన్యువల్‌గా చేసే వారు అక్నాలెడ్జ్‌మెంట్‌ కాపీ తీసుకుని, సంతకం పెట్టి, ఈ ఫారం  ఐటీఆర్‌– Vని సకాలంలో బెంగళూరులోని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌కి స్పీడ్‌ పోస్టులో పంపాలి. అలా పంపకపోతే రిటర్ను వేయనట్లే. జాగ్రత్త వహించండి.  

  • ఏ ఫారం దాఖలు చేయాలన్న విషయాన్ని హెల్ప్‌డెస్క్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

  • 2024–25 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి కొత్త విధానం కంపల్సరీ. అయితే, మీరు ప్రతి సంవత్సరం విధానాన్ని మార్చుకోవచ్చు.  

  • ఆన్‌లైన్‌లో నింపేటప్పుడు వర్తించే విషయాలకు YES అని, వర్తించని వాటికి  NO అని రాయాలి.

అన్ని ఫారంలలో కొత్త షెడ్యూల్స్‌ను పొందుపర్చారు. వీటి వల్ల అదనపు సమాచారం ఇవ్వాలి. అయితే, ఇది ఇవ్వటానికి సరైన కాగితాలు ఉండాలి. పెద్ద కష్టమేమీ కాదు. గతంలో అబద్ధం/తప్పు/ఎక్కువ/తక్కువ/పొరపాటుకి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పప్పులేమీ ఉడకవు. అలాగని భయపడిపోవాల్సిన పని లేదు. తగినంత శ్రద్ధ పెడితే.. ఇదేమీ కష్టమైన పని కాదు.

#

Tags : 1

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)