Breaking News

ఇలా కూడా ఆరా తీస్తారు.. పన్ను వేస్తారు!

Published on Mon, 03/03/2025 - 07:57

ఆదాయపు పన్ను డిపార్టుమెంటు వారు, ఒక్కో అస్సెస్సీకి సంబంధించిన అసెస్‌మెంట్‌ పూర్తి చేసినప్పుడు సమాచారం అడగడానికి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు అమల్లో ఉన్న చట్టం ప్రకారం 142 (1) సెక్షన్‌ కింద విస్తృత అధికారాలు ఉన్నాయి. ఈ మధ్యే ఒక అస్సెస్సీకి నోటీసులు వచ్చాయి. ‘‘మీరు మీ ఇంటి ఖర్చుల నిమిత్తం, సొంత వాడకాలు లేదా విత్‌డ్రాయల్స్‌ చాలా తక్కువగా చూపించారు. కాబట్టి మీ కుటుంబ సభ్యుల వివరాలు, వారి ప్రొఫైల్‌ వివరాలు, వారి పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్లు, వారి వార్షికాదాయం వివరాలు ఇవ్వండి’’  అనేది దాని సారాంశం. ఇవే కాకుండా ఈ కింది వివరాలు కూడా ఇవ్వాల్సి వచ్చింది.

⬩నెలవారీ రేషన్‌ వివరాలు. ఎంత కొన్నారు, ఏ రేటుకు కొన్నారు.
⬩గోధుమ పిండి ఎంత కొన్నారు.. 
⬩బియ్యం ఎంత? 
⬩పప్పు ధాన్యాలెంత కొన్నారు..ఎంతకి కొన్నారు? 
⬩నూనె ఎంత వాడారు.. ఎంతకు కొన్నారు? 
⬩వంట గ్యాస్‌ వినియోగం వివరాలు. 
⬩కరెంటు బిల్లెంత 
⬩కొన్న బట్టల వివరాలు 
⬩షూస్, పాలిష్, జోళ్లు వివరాలు 
⬩క్షవరానికి ఎంత ఖర్చుపెట్టారు 
⬩కాస్మెటిక్స్, స్ప్రేలు 
⬩ఏయే వేడుకలు చేసుకున్నారు. ఖర్చెంత? 
⬩పిల్లల చదువులు, పుస్తకాలు, 
⬩స్కూల్‌ ఫీజుల వివరాలు 
⬩మీరు చెల్లించే అద్దె వివరాలు 
⬩కారు నిర్వహణ ఖర్చులు, ఇన్సూరెన్స్‌ ఎంత? 
⬩హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వివరాలు 
⬩బిల్డింగ్‌ నిర్వహణ, ఇన్సూరెన్స్‌ వివరాలు 
⬩జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు 
⬩చుట్టాలకు, స్నేహితులకు బహుమతులు ఏమిచ్చారు. వాటి విలువెంత? 
⬩రెస్టారెంట్ల ఖర్చులెంత? 
⬩గెట్‌టు గెదర్‌ లాంటి కార్యక్రమాల ఖర్చులు 
⬩సంఘంలోని కార్యకలాపాలు, ఖర్చులు 
⬩రోజువారీ ఖర్చులు

➤ఇలా అన్నింటి వివరాలూ ఇవ్వాలి. ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులున్నారో, వారందరి ఆదాయపు వివరాలు, ఖర్చుల వివరాలు, రుజువులతో సహా ఇవ్వాలి.

➤చివర్లో కొసమెరుపు.. కాదు కాదు.. బెదిరింపు ఏమిటంటే, ‘‘ఈ వివరాలు ఇవ్వకపోతే మీరు ప్రతి సంవత్సరం ఇంటి ఖర్చుల నిమిత్తం రూ. 10,00,000 విత్‌డ్రా చేసినట్లుగా భావిస్తాము’’  అని.

➤అలా భావిస్తే.. భావించారు.. అక్కడితో ఊరుకోరు. ఆ మొత్తం మీద పన్ను కూడా వేస్తారు.

అయితే, సాక్షి పాఠకలోకానికి ఈ అంశం కొత్త కాదు. మనం గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏ ఖర్చుకైనా ‘‘సోర్స్‌’’ ఉండాలి. సోర్స్‌కు సరైన వివరణ లేకపోతే ఆ ఖర్చును ఆదాయంగా భావిస్తారు.

#

Tags : 1

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)