Breaking News

ఐటీఆర్ గడువు పొడిగింపు?: స్పందించిన ఆదాయపు పన్ను శాఖ

Published on Mon, 09/15/2025 - 11:25

ఇన్‌కమ్‌  ట్యాక్స్ రిటర్న్ (ITR) గడువును 2025 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారని.. కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందిస్తూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.

ఐటీఆర్‌లను దాఖలు చేయాల్సిన గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ గడువును ఈ నెల 30 వరకు పొడిగించారని వస్తున్న వార్తలలో నిజం లేదు. అదంతా అవాస్తవం. దానిని నమ్మవద్దు అని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపు, ఇతర సంబంధిత సేవల కోసం పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి, మా హెల్ప్‌డెస్క్ 24x7 అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు తేదీ పెంచాలని.. పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ (కటక్), పీపీ చౌదరి (పాలీ).. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాసి గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. కానీ మంత్రిత్వశాఖ గడువు పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్నిబట్టి చూస్తే.. గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

ఆలస్య రుసుముతో ఐటీఆర్ ఫైలింగ్
గడువు తీరని తరువాత.. డిసెంబర్ 31, 2025 వరకు రూ.5000 వరకు ఆలస్య రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి జరిమానా గరిష్టంగా రూ.1000 ఉంటుంది. ఇక్కడ ఫైన్ ఒక్కటే సమస్య కాదు. కొన్నిసార్లు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ప్రాసిక్యూషన్ కూడా ఉండవచ్చు. గత సంవత్సరం.. ఢిల్లీలోని ఒక మహిళ తన ఐటీఆర్ దాఖలు చేయనందుకు ఆమెకు జైలు శిక్ష విధించారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే.. గడువు లోపలే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం ఉత్తమం.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)