Breaking News

దేశం విడిచి వెళ్తుంటే ట్యాక్స్‌ మొత్తం కట్టాల్సిందేనా? కేంద్రం క్లారిటీ

Published on Sun, 07/28/2024 - 13:04

దేశం విడిచి వెళ్తున్న వారందరూ ముందుగా ట్యాక్స్‌ బకాయిలన్నీ తప్పనిసరిగా చెల్లించాలంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పందించింది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 1961 చట్టంలోని సెక్షన్‌ 230కు సంబంధించి వివరణ ఇచ్చింది.

పన్ను చెల్లింపుదారుల్లో కలకలం సృష్టించిన ఈ వార్తలపై సీబీడీటీ స్పందిస్తూ.. దేశం విడిచి వెళ్తున్న ప్రతి భారతీయ పౌరుడు ట్యాక్స్‌ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ పొందాలని సెక్షన్‌ 230 ఆదేశించదని పేర్కొంది. ఆవశ్యకమైన నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే ఇది వర్తిస్తుంది. 2004 ఫిబ్రవరి 5 నాటి సీబీడీటీ ఇన్‌స్ట్రక్షన్ నంబర్ 1/2004 ప్రకారం, తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు లేదా ప్రత్యక్ష పన్ను బకాయిలు రూ. 10 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే దేశం విడిచి వెళ్లే ముందు ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఎందుకంటే ఇలాంటి వారు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ విచారణలో ప్రత్యక్షంగా పాల్గొనడం అవసరం.

అంతేకాకుండా ట్యాక్స్‌ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ ఏకపక్ష ప్రక్రియ కాదు. దీనికి ఇన్‌కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్‌కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ నుంచి లిఖితపూర్వకమైన ముందస్తు అనుమతి అవసరం. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్, వెల్త్ టాక్స్ యాక్ట్, గిఫ్ట్-టాక్స్ యాక్ట్, ఎక్స్‌పెండిచర్-టాక్స్ యాక్ట్, మనీ యాక్ట్, 2015 వంటి వివిధ పన్ను చట్టాల కింద సదరు వ్యక్తికి ఎటువంటి బకాయిలు లేవని ఈ సర్టిఫికెట్ నిర్ధారిస్తుంది. దీన్ని ఇటీవలి ఫైనాన్స్‌ బిల్లులో ప్రతిపాదించారు.

ఫైనాన్స్‌ (నం. 2) బిల్లు, 2024లో క్లాజ్ 71లో బ్లాక్ మనీ యాక్ట్, 2015కు సంబంధించిన సూచనలను చేరుస్తూ సెక్షన్ 230కి సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణలు వచ్చే అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం.. గుర్తించిన కేటగిరీల కింద కొంతమంది వ్యక్తులు దేశం విడిచి వెళ్లేముందు తప్పనిసరిగా ట్యాక్స్‌ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలి.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు