2026 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు: రాష్ట్రపతి ఆమోదం

Published on Sat, 08/23/2025 - 20:26

ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు 2025కు ఈ నెల 12న ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.

ఈ కొత్త ఆదాయపన్ను చట్టం, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టం 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. పాత చట్టంతో పోల్చితే కొత్త చట్టం సరళతరంగా, పారదర్శకంగా ఉంటుందని ఆదాయపన్ను శాఖ ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది.

పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలు

  • పాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.

  • ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.

  • ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్‌మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.

  • 2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.

  • కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)