Breaking News

రేట్ల కోతతో తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు

Published on Mon, 02/10/2025 - 08:55

ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం రెపో రేటుతో అనుసంధానమయ్యే రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై, ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), డిపాజిట్లతో ముడిపడి ఉన్న రుణాలపై విస్తృత ప్రభావాలు చూపడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

రెపో లింక్డ్ రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనాలు

ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీని రెపో రేటు అంటారు. రెపో రేటును తగ్గించడం వల్ల ఈ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. ఇది చాలా మంది రుణగ్రహీతలకు సమాన నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించడానికి దారితీస్తుంది.

ఎంసీఎల్ఆర్ రుణాలపై ప్రభావం ఆలస్యం

ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్‌తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం వెంటనే కనిపించదు. ఎంసీఎల్ఆర్ అనేది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్‌ వడ్డీ రేటు. రెపో రేటు మాదిరిగా కాకుండా బ్యాంకులకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు.. వంటి వాటిపై ఆధారపడి ఎంసీఎల్‌ఆర్‌లో మార్పులు ఉంటాయి. రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్‌ఆర్‌లో పూర్తిగా ప్రతిబింబించడానికి కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు తమ వ్యయాలను సర్దుబాటు చేయడానికి, రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయడానికి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. ఫలితంగా ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్నవారు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంత కాలం ఆగాలి.

ఇదీ చదవండి: టార్గెట్‌ ఎఫ్‌డీఐ.. విధానాల సవరణకు యోచన!

డిపాజిట్లకు సవాల్..

వడ్డీరేట్ల తగ్గింపు డిపాజిట్ల పరంగా బ్యాంకులకు సవాలుగా మారుతుంది. రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. డిపాజిట్ రేట్లను వెంటనే తగ్గించడం వల్ల బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం కష్టతరం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ పొదుపుపై మంచి రాబడిని కోరుకునే ఇతర మార్గాలను ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)