Breaking News

చైనా కన్నా స్పీడ్‌గా.. అంచనాలను పెంచిన ఐఎంఎఫ్‌

Published on Wed, 10/11/2023 - 09:06

న్యూఢిల్లీ: భారత్‌ ఏప్రిల్‌ 2023తో ప్రారంభమయిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో 6.3% స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) తాజా ‘వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌’ అంచనా వేసింది. తొలి జూలై నెల అంచనా 6.1 శాతాన్ని ఈ మేరకు 20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు 1%) పెంచింది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) అంచనాలకు మించి వినియోగ గణాంకాలు నమోదవడం  తాజా అప్‌గ్రేడ్‌కు కారణమని అవుట్‌లుక్‌ వివరించింది. 2024–25లో కూడా భారత్‌ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ 6.3%గా పేర్కొంది.  

వృద్ధి స్పీడ్‌లో టాప్‌..  
ప్రపంచంలోని రెండవ ఆర్థిక వ్యవస్థ చైనాకన్నా భారత్‌ వృద్ధి స్పీడ్‌ వేగంగా ఉండడం మరో అంశం. 2023లో చైనా వృద్ధి రేటు అంచనాలను ఐఎంఎఫ్‌ 20 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీంతో ఈ రేటు 5%కి తగ్గింది. 2024లో అంచనాలను 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా ఈ రేటు 4.2%కి దిగింది. చైనాలో ప్రోపర్టీ మార్కెట్‌ సంక్షోభంలో ఉండటం కూడా వృద్ధి రేటు కోతకు కారణమని ఐఎంఎఫ్‌ పేర్కొంది.  

ప్రపంచ వృద్ధి అంచనా డౌన్‌ 
కాగా, 2023 ప్రపంచ వృద్ధి అంచనాలను మాత్రం ఐఎంఎఫ్‌ తగ్గించడం గమనార్హం. ఇంతక్రితం 3.2 శాతంగా ఉన్న గ్లోబల్‌ వృద్ధి అంచనాలను తాజాగా 3%కి కుదించింది.

కొన్ని సంస్థల అంచనా ఇలా.. 
సంస్థ    2023–24 (వృద్ధి శాతాల్లో)     
ఆర్‌బీఐ    6.5
ప్రపంచబ్యాంక్‌    6.3
ఎస్‌అండ్‌పీ    6.0
ఫిచ్‌    6.3
మూడీస్‌    6.1
ఏడీబీ     6.3
ఇండియా రేటింగ్స్‌    6.2
ఓఈసీడీ    6.3

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)