Breaking News

ఐకియా ఇండియా నష్టాలు పెరిగాయ్‌

Published on Tue, 12/31/2024 - 06:37

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఫర్నిచర్, హోమ్‌ ఫర్నిషింగ్‌ రిటైలింగ్‌ దిగ్గజం ఐకియా ఇండియా నష్టాలు పెరిగాయి. రూ.1,299 కోట్లను అధిగమించాయి. అమ్మకాలు 4.5 శాతం బలపడి రూ. 1,810 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 1,853 కోట్లయ్యింది. బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ టోఫ్లర్‌ వివరాల ప్రకారం అంతక్రితం ఏడాది(2022–23) రూ. 1,732 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 1,133 కోట్ల నష్టం ప్రకటించింది. నెదర్లాండ్స్‌ దిగ్గజం ఇంకా హోల్డింగ్స్‌కు అనుబంధ సంస్థ ఇది. 

ఓమ్నిచానల్‌ ద్వారా కార్యకలాపాల విస్తరణ కోసం భారీ పెట్టుబడులు చేపట్టడంతో నష్టాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది ధరలు పెంచకపోగా.. కొన్ని ప్రొడక్టులపై ధరలు తగ్గించినప్పటికీ అమ్మకాలు పెంచుకోగలిగినట్లు ఐకియా ఇండియా ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ప్రకటనలు, ప్రమోషనల్‌ ఖర్చులు 2 శాతం అధికమై రూ. 196 కోట్లను దాటాయి. గతేడాది మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 3,152 కోట్లను తాకాయి. అంతక్రితం ఏడాది రూ. 2,895 కోట్ల వ్యయాలు నమోదయ్యాయి. కంపెనీ హైదరాబాద్, నవీముంబై, బెంగళూరు తదితర నగరాలలో లార్జ్‌ఫార్మాట్‌ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈకామర్స్‌ కార్యకలాపాల ద్వారా ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు చేపడుతోంది.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)