Breaking News

2030 నాటికి ఐకియా టార్గెట్‌ రూ. 8,000 కోట్ల టర్నోవర్‌

Published on Wed, 07/15/2026 - 01:02

న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన ఫర్నీచర్‌ రిటైల్‌ దిగ్గజం ఐకియా భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా 2030 నాటికి, ముందుగా నిర్దేశించుకున్న దానికి రెట్టింపు స్థాయిలో, రూ. 21,000 కోట్లు పైగా ఇన్వెస్ట్‌ చేయనుంది. స్థానికంగా కొనుగోళ్లను, స్టోర్స్‌ను పెంచుకోవడంతో పాటు రూ. 8,000 కోట్ల టర్నోవరు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐకియా ఇండియా సీఈవో ప్యాట్రిక్‌ ఆంటోనీ ఈ విషయాలు తెలిపారు.  భారత్‌లో రిటైల్‌ కార్యకలాపాలకు 2013లో అనుమతులు లభించినప్పుడు ఐకియా రూ. 10,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం దానికి రెట్టింపు స్థాయిలో ఇన్వెస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆంటోనీ పేర్కొన్నారు. స్టోర్స్‌ ఏర్పాటు, రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టులు, టెక్నాలజీ సామర్థ్యాలను పెంచుకోవడం మొదలైన వాటిపై పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. ప్రస్తుతం రూ. 2,000 కోట్లుగా ఉన్న టర్నోవరును 2030 నాటికి రూ. 8,000 కోట్లకు పెంచుకోవాలనేది లక్ష్యమని ఆంటోనీ వివరించారు. 2030 నాటికి స్టోర్స్‌ సంఖ్య 30కి చేరుకుంటుందని చెప్పారు. ఇప్పుడు 2,500 మంది ఉద్యోగులు ఉండగా, మరో 2,500 మంది సిబ్బందిని తీసుకోనున్నట్లు తెలిపారు. 2018లో హైదరాబాద్‌లో తొలి స్టోర్‌ ప్రారంభించిన ఐకియాకి ప్రస్తుతం బెంగళూరు, ముంబైలో లార్జ్‌ ఫార్మాట్‌ స్టోర్స్‌ ఉన్నాయి.

#

Tags : 1

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)