Breaking News

పారిశ్రామికోత్పత్తి డౌన్‌

Published on Sat, 05/13/2023 - 04:40

న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి మార్చిలో మందగించింది. విద్యుత్, తయారీ రంగాల పేలవ పనితీరుతో అయిదు నెలల కనిష్టానికి పడిపోయి.. 1.1%గా నమోదైంది. చివరిసారిగా 2022 అక్టోబర్‌లో అత్యంత తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. అప్పట్లో ఐఐపీ 4.1% క్షీణించింది. గతేడాది మార్చిలో ఇది 2.2% కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.8%గా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) డేటా ప్రకారం ...
► విద్యుదుత్పత్తి రంగం 6.1 శాతం వృద్ధి నుండి 1.6 శాతం క్షీణత నమోదు చేసింది.
► తయారీ రంగం వృద్ధి 1.4 శాతం నుంచి 0.5 శాతానికి నెమ్మదించింది.
► మైనింగ్‌ రంగం ఉత్పత్తి 3.9 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది.
► క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగం వృద్ధి 2.4 శాతం నుంచి 8.1 శాతానికి ఎగిసింది.
► ప్రైమరీ గూడ్స్‌ వృద్ధి గత మార్చిలో 5.7% ఉండగా ప్రస్తుతం 3.3%గా నమోదైంది.  
► కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తి మైనస్‌ 3.1 శాతం నుంచి మైనస్‌ 8.4 శాతానికి పడిపోయింది. కన్జూమర్‌ నాన్‌–డ్యూరబుల్‌ గూడ్స్‌  తాజాగా మైనస్‌ 3.1%కి చేరింది.
► ఇన్‌ఫ్రా/ నిర్మాణ ఉత్పత్తుల వృద్ధి 5.4 శాతంగా ఉంది. గత మార్చిలో ఇది 6.7 శాతం.
► 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఐఐపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 11.4%.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి