కోరికలు తీర్చే ‘ఫిష్‌’!

Published on Tue, 08/13/2024 - 14:33

ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. కొనండి. కారు తీసుకోవాలనుకుంటున్నారా.. తీసుకోండి. విదేశాలు చుట్టేయాలనుకుంటున్నారా.. వెళ్లిరండి.  పిల్లలను మంచి స్కూల్‌లో చేర్పించాలంటే.. చేర్పించండి.. అంతా బాగానే ఉంది కానీ, అన్నింటికీ డబ్బుకావాలని ఆలోచిస్తున్నారా. మరేం ఫర్వాలేదు. ఉద్యోగం చేస్తూనే అన్ని కోరికలు తీర్చుకోవచ్చు. ఎలా అంటారా? అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మదుపు ప్రారంభించాలి. ప్రధానంగా అందరికీ ‘ఫిష్‌’ గురించి తెలియాలి. అదేంటి చేప గురించి తెలిస్తే డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారేమో..కాదండి. ‘ఫిష్‌’ను పాటిస్తే దాదాపు మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అసలు ఈ ‘ఫిష్‌’ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

‘ఫిష్‌’ థియరీ

ఎఫ్‌ఐ.ఎస్‌.హెచ్‌: ఫిష్‌..ఆర్థిక ప్రణాళిలో ఈ ఫిష్‌ థియరీని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫిష్‌ థియరీను మూడు భాగాలుగా విభజించారు.

ఎఫ్‌ఐ: ఫిక్స్‌డ్‌ ఎక్స్‌పెన్సెస్‌

ఎస్‌: సేవింగ్స్‌

హెచ్‌: హ్యాపీ టు స్పెండ్‌

ఎఫ్‌ఐ: ఫిక్స్‌డ్‌ ఎక్స్‌పెన్సెస్‌

బ్యాంకు అకౌంట్‌లో జీతం పడగానే నెలవారీ స్థిర ఖర్చుల కోసం(ఎఫ్‌ఐ) డబ్బు వెచ్చించాలి. అందులో ప్రధానంగా ఇంటి అద్దె, ఇంటర్నెట్‌ బిల్లు, సరుకులు, ఫోన్‌ బిల్లు..వంటి ఖర్చులు సాధారణంగా ఉంటాయి. అయితే ఈ మధ్య కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి కదా. ఒకవేళ నెల మధ్యలో అమాంతం వాటి విలువ పెరిగినా ఓ పదిశాతం అధికంగా ఖర్చు చేసే వీలుంటుంది. అందుకు అనువుగా బడ్జెట్‌ కేటాయించుకోవాలి. అయితే ఫిక్స్‌డ్‌ ఎక్స్‌పెన్సెస్‌ అన్నీ కలిపి జీతంలో యాభైశాతానికి మించకుండా జాగ్రత్త వహించాలి.

ఎస్‌: సేవింగ్స్‌

భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు(ఎస్‌) చేయాలి. వేతనంలో 50 శాతం ‘ఎఫ్‌ఐ’కు కేటాయించాక మిగిన దాని నుంచి 30 శాతం ఇంటి నిర్మాణం, రిటైర్‌మెంట్‌ ప్లాన్‌, హెల్త్‌పాలసీ, టర్మ్‌ పాలసీ, ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం కేటాయించాలి. ఎలాంటి మార్గాల్లో మదుపు చేయాలనే అంశంపై నిపుణులతో చర్చించాలి.

ఇదీ చదవండి: మారుతున్న ప్రచార పంథా

హెచ్‌: హ్యాపీ టు స్పెండ్‌

ఇక మిగిలిన 20 శాతం జీతాన్ని ఆనందాలకు, అభిరుచులకు ఖర్చు పెట్టుకోవచ్చు. విందూ వినోదాలకు వెచ్చించవచ్చు. సినిమాలు, షికార్లు, షాపింగ్‌..వంటి వాటికి ఏంచక్కా ఖర్చు చేసుకోవచ్చు. కానీ పైన తెలిపిన విధంగా ఇతర వాటికి డబ్బు కేటాయించిన తర్వాతే మిగతా సొమ్మును ఖర్చు పెట్టాలి. ఒక్కసారి ఈ ‘ఫిష్‌’ థియరీను ఆకలింపు చేసుకుని ప్రయోగాత్మకంగా కొన్ని నెలలు పాటిస్తే ఆర్థిక జీవితంలో మార్పు గుర్తిస్తారని నిపుణులు చెబుతున్నారు.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)