ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఆల్‌టైమ్‌ రికార్డు లాభం

Published on Wed, 07/29/2026 - 17:14

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) రూ. 1,075 కోట్ల ఆల్‌టైమ్‌ రికార్డు నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ1లో నమోదైన రూ. 463 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 132.4 శాతం వృద్ధి చెందడం విశేషం. బ్యాంక్‌ మొత్తం కస్టమర్‌ వ్యాపారం 18.6% వృద్ధితో  రూ.5,10,031 కోట్ల నుంచి రూ.6,04,776 కోట్లకు చేరింది.

జారీ చేసిన రుణాలు, అడ్వాన్సులు 20.6 శాతం వృద్ధితో రూ. 3,05,370 కోట్లకు పెరిగాయి. ఆస్తుల నాణ్యత కూడా గణనీయంగా మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు 1.97 శాతం నుంచి 1.51 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పీఏ 0.55 శాతం నుంచి 0.44 శాతానికి దిగొచి్చంది. నికర వడ్డీ మార్జిన్‌ గతేడాది ఉన్న 5.71 శాతం నుంచి 5.96 శాతానికి బలపడింది.

ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ లాభం 37% జంప్‌
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (AU Small Finance Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) అద్భుత ప్రదర్శన కనబరిచింది. బ్యాంక్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 37 శాతం వద్ధితో రూ.796 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం, నికర వడ్డీ మార్జిన్లు 5.9%కి మెరుగుపడటంతో లాభాలు పెరిగాయి. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 32 శాతం పెరిగి రూ.2,695 కోట్లకు చేరింది. రుణాలు 23 శాతం వృద్ధి చెందాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.10 శాతానికి తగ్గడం ద్వారా ఆస్తుల నాణ్యత మెరుగైంది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)