ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ఫలితాలు ఆకర్షణీయం

Published on Mon, 07/31/2023 - 00:24

ముంబై: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 61 శాతం వృద్ధితో రూ.765 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.474 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.3,745 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.2,571 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.1,427 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్‌ తెలిపింది. రుణ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది.

స్థూల ఎన్‌పీఏలు 2.17 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి 3.36%గా ఉంటే, ఈ ఏడాది మార్చి చివరికి 2.51 శాతంగా ఉండడం గమనా ర్హం. నికర ఎన్‌పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. ‘‘46.5% కాసా రేషియోతో బలమైన ఫ్రాంచైజీని నిర్మిస్తున్నాం. బలమైన బ్రాండ్, విలువలు, కస్టమర్‌ అనుకూలమైన ఉత్పత్తులు, డిజిటల్‌ ఆవిష్కరణలతో మా రిటైల్‌ డిపాజిట్లు చక్కగా వృద్ధి చెందుతున్నాయి’’అని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్‌ తెలిపారు. ఫండెడ్‌ అసెట్స్‌ (రాబడినిచ్చే ఆస్తులు) 25% వృద్ధితో రూ.1,71,578 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణ ఆస్తుల్లో ఇన్‌ఫ్రా రుణాలు 2.2 శాతానికి తగ్గాయి.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)