Breaking News

ఇక్రిశాట్ వాటర్ హైసింత్ హార్వెస్టర్: దీని గురించి తెలుసా?

Published on Tue, 11/18/2025 - 19:58

ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT).. రూపొందించిన సౌరశక్తితో పనిచేసే ''వాటర్ హైసింత్ హార్వెస్టర్‌'' జాతీయ గుర్తింపు పొందుతుంది. కాగా ఇప్పుడు ఇండియా ఇన్నోవేటర్స్ అసోసియేషన్ ద్వారా 2025లో టాప్ 100 ఇండియన్ ఇన్నోవేషన్లలో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని నవంబర్ 13న గోవాలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎక్స్‌పో (INEX India)లో ప్రకటించారు.

సాధారణంగా నీరు నిల్వ ఉండే చోట.. నీటి మొక్కలు పుడతాయి. వీటి సంఖ్య ఎక్కువై.. జలాశయాలను మొత్తం ఆవరించినప్పుడు సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఇక్రిశాట్ ఈ వాటర్ హైసింత్ హార్వెస్టర్‌ రూపొందించింది. వాటర్ హైసింత్ (ఒక రకమైన నీటిలో తేలియాడే మొక్కలు) జలమార్గాలకు ఆటంకాలను కలిగిస్తాయి. ఇవి జలచరాలకు సైతం ఊపిరాడకుండా.. నీటి నాణ్యతను కూడా దిగజారుస్తాయి. ఈ సమస్యలను వాటర్ హైసింత్ హార్వెస్టర్‌ పరిష్కరిస్తుంది.

వాటర్ హైసింత్ హార్వెస్టర్‌ పనిచేయడానికి కేవలం సూర్యరశ్మి సరిపోతుంది. ఎందుకంటే.. ఇది సోలార్ ప్యానెల్స్ పొందుతుంది. దీనిని ఉపయోగించడం ద్వారా కలుపును తొలగించవచ్చు. మొత్తం మీద ఇది పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు చాలా ఉపయోగపడుతుందని ఇక్రిశాట్ వెల్లడించింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)