Breaking News

అదనపు రాబడికి బంగారం లాంటి పథకం..

Published on Mon, 04/03/2023 - 07:26

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా గోల్డ్‌ పేరిట వినూత్న, దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ఆవిష్కరించింది. ఇటు వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు అదనపు రాబడి అందుకోవాలనుకునే వారికి అనువైనదిగా ఇది ఉంటుందని సంస్థ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ అమిత్‌ పాల్టా తెలిపారు. ఇది జీవిత బీమా కవరేజీతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రతను కూడా అందిస్తుందని పేర్కొన్నారు.

(కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ..  అమల్లోకి కొత్త ధరలు)

ఐసీఐసీఐ ప్రు గోల్డ్‌ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇమీడియట్‌ ఇన్‌కమ్, ఇమీడియట్‌ ఇన్‌కమ్‌ విత్‌ బూస్టర్, అలాగే డిఫర్డ్‌ ఇన్‌కమ్‌ వీటిలో ఉన్నాయి. మొదటి దానిలో పాలసీ జారీ చేసిన 30 రోజుల తర్వాత నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇక రెండో వేరియంట్‌లో ప్రతి ఐదో ఏటా అదనంగా గ్యారంటీడ్‌ ఆదాయాన్ని కూడా అందుకోవచ్చు.

మూడోదైన డిఫర్డ్‌ ఇన్‌కమ్‌ వేరియంట్‌లో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా వినియోగదారులు ఆదాయాన్ని ఎప్పటి నుంచి పొందాలనుకుంటున్నది తామే నిర్ణయించుకోవచ్చు. అంటే పాలసీ తీసుకున్న రెండో ఏడాది నుంచే లేదా 13 ఏళ్ల తర్వాత నుంచైనా ఆదాయాన్ని అందుకోవడం ప్రారంభించవచ్చు. చెల్లింపులను సాధారణంగా తీసుకోవడానికి బదులుగా సేవింగ్స్‌ వాలెట్‌లో జమ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని కావాలంటే పూర్తిగా లేదా పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా ప్రీమియం ఆఫ్‌సెట్‌ సదుపాయంతో తమ భావి ప్రీమియంలను కూడా ఈ మొత్తం నుంచి చెల్లించవచ్చు.

(Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)