Breaking News

ఐసీఐసీఐ బ్యాంక్‌కి ప్రొవిజనింగ్‌ దన్ను

Published on Sun, 04/19/2026 - 06:27

ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీయంగా రెండో అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 9.28 శాతం వృద్ధి చెంది రూ. 14,755 కోట్లకు చేరింది. మొండిబాకీలు మొదలైన వాటికి కేటాయింపులు ఏకంగా 90 శాతం తగ్గడం ఇందుకు దోహదపడింది. శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం గతేడాది క్యూ4లో రూ. 891 కోట్లుగా ఉన్న ప్రొవిజనింగ్‌ ఈ మార్చ్‌ క్వార్టర్లో రూ. 96.16 కోట్లకు తగ్గింది. డిసెంబర్‌ క్వార్టర్‌లో ఇది రూ. 2,556 కోట్లుగా ఉంది. సమీక్షాకాలంలో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 8.4 శాతం వృద్ధితో రూ. 22,979 కోట్లకు చేరింది. అసెట్స్‌ 15 శాతం వృద్ధి చెందడం, నికర వడ్డీ మార్జిన్‌ స్వల్పంగా 4.32 శాతానికి పెరగడం ఇందుకు ఉపయోగపడింది.  

    ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న క్రమంలో ఆరోగ్యకరమైన ఫలితాలు సాధించగలిగినట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సందీప్‌ బాత్రా తెలిపారు. ఎకానమీ మెరుగుపడే కొద్దీ మరింతగా రుణాలిచ్చేందుకు తమ దగ్గర తగినన్ని నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్‌ అంచనాలను వెల్లడించడం కష్టమని బాత్రా చెప్పారు. తమ రిస్కు సామర్థ్యాల పరిధికి లోబడి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. క్యూ4లో అసెట్‌ క్వాలిటీ, రికవరీలు మెరుగుపడటం వల్ల ప్రొవిజనింగ్‌ తగ్గిందని, అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించిన రూ. 13,100 కోట్ల నిధి అలాగే ఉందని ఆయన పేర్కొన్నారు.  2026 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు ఒక్కో షేరుకి రూ. 12 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది.  

ఫలితాల్లో కీలకాంశాలు.. 
→ క్యూ4లో వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ కాకుండా) 5.6 శాతం పెరిగి రూ. 7,415 కోట్లకు చేరింది. రూపాయిపై అతి స్పెక్యులేషన్‌ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న చర్యలతో ట్రెజరీ విభాగానికి సంబంధించి రూ. 106 కోట్ల నష్టం వచ్చింది.  
→ నిర్వహణ వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 12,089 కోట్లకు చేరాయి. 
→ అసెట్‌ క్వాలిటీ విషయానికొస్తే స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి డిసెంబర్‌లో 1.53 శాతంగా, గతేడాది మార్చి క్వార్టర్‌లో 1.67 శాతంగా ఉండగా ప్రస్తుతం 1.40 శాతానికి తగ్గింది. స్థూల స్లిప్పేజీలు రూ. 4,242 కోట్లుగా ఉన్నాయి.  
→ బిజినెస్‌ బ్యాంకింగ్‌ దన్నుతో రుణ వృద్ధి 24 శాతం మేర నమోదైంది. గ్రామీణ రుణాల పోర్ట్‌ఫోలియో 25 శాతం మేర పెరగగ్గా, రిటైల్‌ వాటా 41 శాతానికి నెమ్మదించింది. దేశీయంగా కార్పొరేట్‌ రుణాలు 9 శాతం పెరిగినప్పటికీ, పోర్ట్‌ఫోలియోలో వీటి వాటా 20 శాతానికి పరిమితమైంది. రాబోయే రోజుల్లో ఇది కొంత పెరిగే అవకాశం ఉంది.  
→ మార్చి 31 నాటికి బ్యాంక్‌ క్యాపిటల్‌ అడెక్వసీ 17.18 శాతంగా ఉంది.  
→ స్టాండెలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ. 13,702 కోట్లకు చేరింది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 12,630 కోట్లతో పోలిస్తే 8.5 శాతం పెరిగింది.  
→ 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 6.2 శాతం వృద్ధి చెంది రూ. 50,147 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 47,227 కోట్లు.  
 

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)