Breaking News

ప్రముఖ కంపెనీ కార్ల రీకాల్‌.. ఎందుకంటే..

Published on Sat, 06/15/2024 - 09:51

హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) తన ఈవీ అయానిక్‌5 మోడల్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసీసీయూ)ను అప్‌గ్రేడ్‌ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. జులై 21, 2022 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య తయారు చేసిన అయానిక్‌ 5 మోడల్‌ కార్లలో ఐసీసీయూలో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా హెచ్‌ఎంఐఎల్‌ ప్రతినిధి మాట్లాడుతూ..‘కార్ల రీకాల్‌ అంశాన్ని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ (ఎస్‌ఐఏఎం)కు తెలియజేశాం. హ్యుందాయ్ మోటార్ ఇండియా కస్టమర్ భద్రతకు ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా 1,744 యూనిట్ల అయానిక్‌ 5 మోడల్‌కార్లను రీకాల్‌ చేస్తున్నాం. వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా వాటిలోని ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్‌ను తనిఖీ చేసి ఏదైనా సమస్యలుంటే అప్‌గ్రేడ్ చేస్తాం. రీకాల్‌ ప్రక్రియలో కార్ల యజమానులతో సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు వ్యక్తిగతంగా సంప్రదిస్తాయి’ అని తెలిపారు. అయానిక్‌ 5 ప్రారంభ ధర రూ.46.05 లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది.

ఇదీ చదవండి: టీవీ, మొబైళ్లలోకి ప్రవేశిస్తున్న ‘గాలి’!

ఈ ఏడాదిలో కంపెనీకి చెందిన కార్లను రీకాల్ చేయడం ఇది రెండోసారి. ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్‌లో సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి జూన్ 6, 2023 మధ్య తయారు చేసిన క్రెటా, వెర్నా 7,698 యూనిట్లను ఫిబ్రవరిలో రీకాల్ చేశారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు